Ira Khan: నేను ఎస్‌ చెప్పాను.. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో స్టార్‌ హీరో కూతురు ఎంగేజ్‌మెంట్.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan), ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే తన సోషల్‌ మీడియాలో ప్రియుడితో కలిసున్న ఫొటోలను నిత్యం షేర్‌ చేస్తోందీ స్టార్‌ కిడ్‌.

Ira Khan: నేను ఎస్‌ చెప్పాను.. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో స్టార్‌ హీరో కూతురు ఎంగేజ్‌మెంట్.. వీడియో వైరల్‌
Ira Khan
Follow us
Basha Shek

|

Updated on: Sep 23, 2022 | 1:59 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan), ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే తన సోషల్‌ మీడియాలో ప్రియుడితో కలిసున్న ఫొటోలను నిత్యం షేర్‌ చేస్తోందీ స్టార్‌ కిడ్‌. అయితే ఇద్దరూ ఎంత అన్యో్న్యంగా ఉన్నా తమ రిలేషన్‌షిప్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదీ లవ్‌బర్డ్స్‌. అయితే తాజాగా ఓ క్యూట్‌ వీడియోతో తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. సైక్లింగ్‌ పోటీల కోసం ఇటీవల నుపుర్‌ విదేశాలకు వెళ్లగా ఇరా సైతం అతనికి తోడుగా వెళ్లింది. పోటీలు ముగిసిన వెంటనే ప్రియురాలి వద్దకు వచ్చిన నుపుర్‌ ఆమెను హత్తుకుని ముద్దాడాడు. అనంతరం మోకాలిపై కూర్చొని ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఉంగరం తొడుగుతూ ప్రపోజ్‌ చేశాడు. ప్రియుడు అంత ప్రేమతో ప్రపోజ్‌ చేస్తే ఎవరు కాదంటారు. అందుకే వెంటనే ‘ఎస్‌’ అని చెప్పి మురిసిపోయింది ఇరా.

ఇట్స్‌ అఫిషియల్‌..

ఇవి కూడా చదవండి

కాగా దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ‘నేను ఎస్‌ చెప్పాను’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాతిమా సనా షేక్‌, సాన్యా మల్హోత్రా, రియా చక్రవర్తి, రోహ్మాన్‌ షాల్‌, హెజెల్‌ కీచ్‌ తదితర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ప్రేమ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా గత కొన్నేళ్ల నుంచి ఆమిర్‌ ఖాన్‌కు పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు నుపుర్‌. ఈక్రమంలోనే అతనికి ఇరాతో పరిచయం ఏర్పడింది. మొదట ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. కొంతకాలానికి అది ప్రేమగా చిగురించింది. 2020 నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినా ఎప్పుడూ తమ రిలేషన్‌షిప్ గురించి ప్రకటించలేదీ లవ్‌బర్డ్స్‌. అయితే తాజా వీడియోతో తమ బంధాన్ని అధికారికంగా తెలియజేశారు.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?