AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhello Show: ‘మీ నిర్ణయం సరైంది కాదు.. మరోసారి ఆలోచించండి! సినిమా చూడకుండా ఎలా నామినేట్‌ చేస్తారు..’

అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిషాత్మక ఆస్కార్‌ నామినేషన్స్‌కు గుజరాతీ మువీ 'ఛెల్లో షో' మువీని ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

Chhello Show: 'మీ నిర్ణయం సరైంది కాదు.. మరోసారి ఆలోచించండి! సినిమా చూడకుండా ఎలా నామినేట్‌ చేస్తారు..'
Chhello Show
Srilakshmi C
|

Updated on: Sep 23, 2022 | 8:58 PM

Share

Chhello Show As India’s Official Entry To Oscars 2023: అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిషాత్మక ఆస్కార్‌ నామినేషన్స్‌కు గుజరాతీ మువీ ‘ఛెల్లో షో’ మువీని ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఆర్ఆర్‌, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి భారీ చిత్రాలను వెనక్కినెట్టి ఆస్కార్‌ బరిలోకి ఇండియా అఫీషియల్‌ ఎంట్రీ కింద ఈ మువీని ఎంపిక చేయడం పట్ల ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) తన నిర్ణయాన్ని పునరాలోచించాలని FWICE ప్రెసిడెంట్‌ బీఎన్‌ తివారీ డిమాండ్ చేశారు. ‘ఛెలో షో’ అసలు భారతీయ చిత్రం కాదని, సెలక్షన్ ప్రాసెస్‌ కరెక్ట్‌గా లేదని, ఆర్‌ఆర్‌ఆర్, ది కశ్మీర్‌ ఫైల్స్‌, కేజీఎఫ్‌ వంటి ఎన్నో సినిమాలు ఉండగా, ఒక ఫారెన్‌ మువీని జ్యూరీ నామినెట్‌ చేయడం సమంజసం కాదని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న జ్యూరీ సభ్యులు సినిమాలను చూడకుండానే పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. FWICE కొత్త జ్యూరీని కోరుకుంటోంది. ప్రస్తుత జ్యూరీని రద్దు చేయాలి. దీనిలో ఏళ్ల తరబడి సభ్యులుగా కొనసాగుతన్నవాళ్లు సినిమా చూడకుండానే ఓటు వేశారు. ‘లాస్ట్ ఫిల్మ్ షో’ ఆస్కార్‌కు నామినేట్‌ చేస్తే.. అత్యధిక సినిమాలను నిర్మించే భారత్ చిత్ర పరిశ్రమపై చెడు ప్రభావం పడుతుందని తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్‌ మువీ అయిన ‘లాస్ట్ ఫిల్మ్ షో’ ఆధారంగా పాన్ నలిన్ దర్శకత్వంలో గుజరాతీ భాషలో ‘ఛెల్లో షో’ మువీని తెరకెక్కించారు. సిద్ధార్థ్ రాయ్ కొనుగోలు చేసిన ఒక విదేశీ చిత్రాన్ని జ్యూరీ ఎలా ఎంపిక చేస్తుందని FWICE ప్రశ్నించారు. FWICE తమ ఫిర్యాదులను సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు.

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI)లో 17 మంది సభ్యులతో కూడిన జ్యూరీ.. 13 ఎంట్రీలలో ఛెల్లో షోను ఎంపిక చేసింది. గుజరాతీ భాషలో తెరకెక్కిన ఛెల్లో షో మువీలో తొమ్మిదేళ్ల బాలుడి కథ ప్రధానాంశంగా ఉంది. ఈ కథ గుజరాత్‌లోని సౌరాష్ట్రకు సంబంధించింది. డైరెక్టర్‌ పాన్ నలిన్ కూడా సౌరాష్ట్రలో పుట్టి పెరిగాడు. ఇది అతని సెమీ-ఆత్మకథ అని ఆస్కార్‌ల ఎంపిక కమిటీకి గతంలో అధ్యక్షునిగా పనిచేసిన టీఎస్ నాగభరణ అన్నారు.