AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywod: కుర్రాళ్ళకు అగ్ని పరీక్ష.. ఏంటి స్వామి ఇది.. ఒక్క హిట్ ఇవ్వొచ్చుగా..!

కుర్ర హీరోలపై బ్యాడ్ టైమ్ బాగా పగ పట్టేసింది. మోస్ట్ బ్యాంకబుల్ హీరోలను కూడా వరస ఫ్లాపులు వెక్కిరిస్తున్నాయి. నాని, నాగ చైతన్య లాంటి మీడియం రేంజ్ స్టార్స్ సైతం ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నారు.

Tollywod: కుర్రాళ్ళకు అగ్ని పరీక్ష.. ఏంటి స్వామి ఇది.. ఒక్క హిట్ ఇవ్వొచ్చుగా..!
Tollywood Industry
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2022 | 8:46 PM

Share

Tollywood:ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు టైమ్ అస్సలు బాగుండటం లేదు. ఒక్కరో ఇద్దరో కాదు.. చాలా మంది మీడియం రేంజ్ హీరోలు ఇప్పుడు ఫ్లాపుల్లోనే ఉన్నారు. వాళ్ల సినిమాలు ఇలా వస్తున్నాయి.. అలా వెళ్తున్నాయి.. కనీసం వచ్చిన విషయం కూడా తెలియకుండా వెళ్లిపోయిన సినిమాలున్నాయి. మరి హిట్‌కు ఆ రేంజ్‌లో మొహం వాచిపోయిన హీరోలెవరు.. వాళ్ళిప్పుడు చేస్తున్న సినిమాలేంటి..? కుర్ర హీరోలపై బ్యాడ్ టైమ్ బాగా పగ పట్టేసింది. మోస్ట్ బ్యాంకబుల్ హీరోలను కూడా వరస ఫ్లాపులు వెక్కిరిస్తున్నాయి. నాని, నాగ చైతన్య లాంటి మీడియం రేంజ్ స్టార్స్ సైతం ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నారు. వైష్ణవ్ తేజ్, నితిన్ లాంటి హీరోల సినిమాలు వచ్చెళ్లినట్లు కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య కనిపించడమే మానేసారు. ఇంకా చాలా మందికి బ్యాడ్ టైమ్ నడుస్తుంది.

మాచర్ల నియోజకవర్గంతో ఊహించిన దానికంటే పెద్ద ఫ్లాపిచ్చారు నితిన్. ఈయన ఆశలన్నీ ఇప్పుడు వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి. ఇక నాని సైతం అంటే సుందరానికితో నిరాశ పరిచారు. ఆ ఫలితం మరిచిపోయి.. దసరాతో బ్లాక్‌బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. ఇక వరస విజయాలతో జోరు మీదున్న చైతూకు లాల్ సింగ్ చెడ్డా, థ్యాంక్యూ బ్రేక్ వేసాయి. ప్రస్తుతం ఈయన వెంకట్ ప్రభు సినిమాకు కమిటయ్యారు. గోపీచంద్ సైతం సరైన హిట్ కోసం చాలా కాలంగా చూస్తున్నారు. మెగా కుర్రాళ్లను కూడా ప్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి.

గనితో దారుణంగా నిరాశ పరిచిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం రెండు ప్రయోగాత్మక సినిమాలతో వస్తున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ ఉప్పెన తర్వాత తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్నారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాతో రాలేదు.. దానికి ముందు చేసిన రిపబ్లిక్ ఆడలేదు. మొత్తానికి ఈ హీరోలంతా అర్జంట్‌గా హిట్ కొట్టకపోతే మార్కెట్ మరింత పడిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి