Astro Tips: ఆ రోజుల్లో స్త్రీలు తలంటు స్నానం చేయరాదు.. అలా చేస్తే దరిద్రమంతా మీ నెత్తి పైనే..

సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే చాలా మంచిదంటారు. ఇకపోతే, సంప్రదాయాల ప్రకారం కొన్ని వారాల్లో తల స్నానం చేయకూడదని చెబుతుంటారు. ఈ రోజుల్లో జుట్టు కడగడం స్త్రీలకు, వారి కుటుంబాలకు మంచిది కాదంటారు.

Astro Tips: ఆ రోజుల్లో స్త్రీలు తలంటు స్నానం చేయరాదు.. అలా చేస్తే దరిద్రమంతా మీ నెత్తి పైనే..
Head Bath
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 23, 2022 | 6:38 PM

Astro Tips: స్నానాలు ఉదయం పూటనే చేయాలని పెద్దలు చెబుతుంటారు. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే చాలా మంచిదంటారు. ఇకపోతే, సంప్రదాయాల ప్రకారం కొన్ని వారాల్లో తల స్నానం చేయకూడదని చెబుతుంటారు. అంతే కాదు మరి కొన్ని రోజుల్లో కచ్చితంగా తల స్నానం చేయాలని కూడా అంటుంటారు. వాస్తవానికి తలస్నానం అనేది అందరికీ రోజు చేసే వీలు, వసతి కలుగదు . అలాంటి వారు వారనికి రెండు,మూడు రోజులు తలస్నానం చేస్తారు. అయితే ఏ రోజుల్లో తల స్నానం చేయాలి, ఏ రోజుల్లో చేయకూడదు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పెళ్లయిన ఆడవారు ఏయే రోజుల్లో తన స్నానం చేయాలి, ఏయే రోజుల్లో తల స్నానం చేయకూడదు..అనే విషయం గురించి శాస్త్రరీత్యా పరిశీలించినట్లైతే ..

వివాహిత స్త్రీలు తలంటు స్నానానికి  కొన్ని నియమాలు ఉన్నాయి. మంగళవారం, గురువారాలు, శనివారాల్లో వివాహిత స్త్రీలు తలస్నానం చేయకూడదని నమ్ముతారు. ఈ రోజుల్లో జుట్టు కడగడం స్త్రీలకు, వారి కుటుంబాలకు మంచిది కాదంటారు. కొన్ని ప్రదేశాలలో సోమవారం జుట్టు కడగడం కూడా నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబంలోని వ్యక్తుల ప్రగతిపై చెడు ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఈ వారం రోజులలో కాకుండా అమావాస్య, పూర్ణిమ, ఏకాదశి నాడు స్త్రీలు జుట్టును కడగకూడదు. కానీ, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ జుట్టును కడుక్కోవచ్చు. అదేవిధంగా వివాహిత స్త్రీలు ఉపవాసానికి ఒక రోజు ముందు వారి జుట్టును కడగాలి.

సోమవారానికి పరిహారాలు – సోమవారం నాడు మీ జుట్టును కడుక్కోండి. మీరు ఆ రోజు ఉపవాసం ఉన్నట్లయితే. మీ చేతులతో పూరుసు పువ్వులను మెత్తగా చేసి, వాటిని మీ జుట్టుకు పూయండి. అప్పుడు జుట్టు కడగాలి.

ఇవి కూడా చదవండి

మంగళవారం నివారణలు- కొన్ని కారణాల వల్ల మంగళవారం నాడు తలస్నానం చేయాల్సి వస్తే జామకాయ రసం లేదా జామకాయని పేస్ట్ చేసి దానిని తలకు పట్టించాలి.

బుధవారం నివారణ- మీరు బుధవారం మీరు తలస్నానం చేయాల్సి వస్తే.. ముందుగా తులసి ఆకుల పేస్ట్‌ని మీ జుట్టుకు పట్టించి.. ఆపై మీ తలని కడగాలి.

గురువారం పరిహారాలు- గురువారం రోజున స్త్రీల జుట్టు కడుక్కోవడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఉండదు. కాబట్టి గురువారం నాడు జుట్టును కడుక్కోవాల్సి వస్తే కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేయాలి. ఇక పెళ్లయిన మహిళలు తల స్నానం చేయడానికి వారంలోని ఉత్తమ రోజులు శుక్రవారం, ఆదివారం. శరీరం సహకరించిన వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తర్వాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

(నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)