Health Tips: బరువు తగ్గడానికి ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా.. నిపుణులు ఏమన్నారంటే..

దీంతో పాటు నిద్రకు ఒక గంట ముందు కంప్యూటర్, సెల్ ఫోన్, టీవీ చూడటం వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Health Tips: బరువు తగ్గడానికి ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా.. నిపుణులు ఏమన్నారంటే..
Weight Loss
Follow us

|

Updated on: Sep 23, 2022 | 5:13 PM

weight loss: శారీరక ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అభిజ్ఞా క్షీణత, మానసిక రుగ్మతలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే అనేక నివేదికల ద్వారా తెలుసుకున్నాం. విన్నాం. అయితే నిద్రకు, బరువు తగ్గడానికి గల సంబంధం గురించి మనకు పెద్దగా తెలియదు. ఒక వ్యక్తి పేలవమైన నిద్ర అలవాట్లు ఆరోగ్య రుగ్మతలు,స్థూలకాయానికి దారి తీయవచ్చు. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు సరిగ్గా నిద్రపోకపోతే బరువు తగ్గరని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

తగినంత నిద్ర లేని వ్యక్తులలో శరీరం గ్రెలిన్ అనే హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తుంది. ఇది మనం తినాలనే కోరికను ప్రేరేపిస్తుంది. దీని వల్ల మీరు అతిగా తినడం, బరువు పెరగడం జరుగుతుంది. లెప్టిన్ అనే హార్మోన్ మనం ఎంత తింటున్నామో అంచనా వేసి, మనకు సరిపడినంత అనుభూతిని కలిగిస్తుంది. మనకు తగినంత నిద్ర లేకపోతే, ఈ హార్మోన్ సరిగ్గా పనిచేయదు. అది సరిగా పనిచేయకపోతే..త్వరగా అలసిపోతాము..దాంతో మన శారీరక శ్రమ తగ్గుతుంది. బరువు పెరిగేలా చేస్తుంది.. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు రోజుకు 7-8 గంటలు నిరంతరాయంగా నిద్రపోవాలి.

అలాగే బరువు తగ్గాలనుకునే వారు రోజూ కొంత వ్యాయామం చేసి రాత్రి పడుకునే 2 నుంచి 3 గంటల ముందు భోజనం ముగించాలి. రాత్రి పడుకునే ముందు సాధారణ వ్యాయామాలు లేదా ధ్యానం చేయవచ్చు. నిద్రపోయే ముందు కెఫీన్ వినియోగానికి దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. నిద్రకు ఒక గంట ముందు కంప్యూటర్, సెల్ ఫోన్, టీవీ చూడటం వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి