Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: మన శరీరంలో ఐరన్ మాత్రమే కాదు.. బంగారం కూడా ఉంటుందని మీకు తెలుసా.. ఎంత ఉంటుందంటే..

శరీరం గురించి మనకు తెలిసిన దానికంటే ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. మన శరీరం గురించి మనకు తెలియని కొన్నిఆసక్తికరమైన విషయాలతోపాటు బంగారం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం..

Gold: మన శరీరంలో ఐరన్  మాత్రమే కాదు.. బంగారం కూడా ఉంటుందని మీకు తెలుసా.. ఎంత ఉంటుందంటే..
Gold Is Found In The Human
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 23, 2022 | 5:27 PM

మానవ శరీరం ఒక సంక్లిష్టమైన నిర్మాణం.. అలాగే ఇది ఓ రహస్యం గూడు. మరింత ముందుకెళ్లితనే ఓ కనిజాలకు నిధి. శరీరం గురించి మనకు తెలిసిన దానికంటే ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. శరీరానికి సంబంధించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే మీరు  ఆశ్చర్యపోతారు. మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించే తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవల్సిందే. మనిషి శరీరంలో ఇనుము మాత్రమే కాదు బంగారం కూడా ఉంటుంది. మీకు ఈ సమాచారం వింతగా లేదా ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. మన శరీరం గురించి మనకు తెలియని కొన్నిఆసక్తికరమైన విషయాలతోపాటు బంగారం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో చాలా బంగారం ఉంది..

మానవ శరీరంలో బంగారం కూడా కనిపిస్తుంది. కానీ దాని పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 0.2 మి.గ్రా. శరీరంలో లభించే బంగారం చాలా వరకు రక్తంలో కరిగిపోతుంది. మనిషి శరీరంలోనే కాకుండా ఆవు మూత్రంలో కూడా బంగారం ఉంటుంది. ఇక్కడ కూడా పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని మనం బంగారంగా మార్చు కోలేము.. ఉపయోగించలేం.

మానవ శరీరంలో ఐరన్ గోరుతో సమానం

మానవ శరీరంలో వివిధ మూలకాలు కనిపిస్తాయి. శరీరంలో బంగారం పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. మన శరీరంలో బంగారం కంటే కొద్ది పరిమాణంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గోర్లు పెరిగిందుకు ఐరన్ సహాయ పడుతుంది.. మానవ శరీరం గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నదాని కంటే మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. రాబోయే కాలంలో.. మానవ శరీరానికి సంబంధించిన అన్ని రహస్యాలు కూడా బయటపడతాయని పరిశోధకుల అభిప్రాయపడుతున్నారు.

శరీరంలో ఉండే ఖనిజాలు ఇవే..

ఖనిజ లవణాలు మన శరీరంలో జీవక్రియలను, కణాల, కణజాల సంరక్షణకు, ఇంకా మన ఆరోగ్యానికి దోహదం చేసే ఇతర కార్యకలాపాలను పరిరక్షించే సూక్ష్మపోషకాలు. ఇవి చిన్న మోతాదులో అవసరమైనప్పటికి వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అయితే.. స్థూల ఖనిజలవణాలు అంటే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, సోడియంలు. ఇవి మన శరీరంలో 0.05% ఉంటాయి. ఇక సూక్ష్మఖనిజలవణాలు మన శరీరంలో 0.05% కంటే తక్కువగా ఉండే ఖనిజలవణాలను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు. వీటినే ట్రేస్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఐరన్, అయొడిన్, జింక్, కాపర్, ఫ్లోరిన్, సెలీనియం, క్రోమియం, మాంగనీస్, కోబాల్ట్, మాలిబ్డినం లను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు.

సముద్రంలో అత్యధికంగా బంగారు నిల్వలు ఉన్నాయి..

బంగారం నిల్వల విషయానికొస్తే, భూమిపై మైనింగ్ ద్వారా బంగారం లభిస్తుంది. బంగారం చాలా భూమ్యాకాశాలలో దొరుకుతుంది.. కాని అంతకంటే ఎక్కువ మొత్తం సముద్రంలో దొరుకుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సముద్రంలో అతిపెద్ద బంగారం నిల్వ ఉంది.. కానీ దానిని వెలికితీసేందుకు అధిక వ్యయం,శ్రమ, సమయం పడుతుంది.. అందుకే దానిపై మనిషి సాహసం చేయడం లేదు.

‘శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం’..

మనిషి మనుగడకు శరీరమే ఆధారం. శరీరం లేకుండా మిగతా అవయవాలు,ఇంద్రియాలు ఉండలేవు. శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అని మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతుంటారు. అంటే ఏదైనా చేయాలంటే ఈ శరీరం ఉండాలని వారి అర్థం.. అందుకే మంచి పనులు ఈ శరీరం ఉండగానే చేయాలని సూచిస్తారు. అయితే.. కర్మేంద్రియాలకీ పని కావాలి. వ్యాయామం కావాలి, పోషణకు మర్ధనలు కావాలి. ఆరోగ్యకరమైన శరీరం లేనిదే సాధన కుదరదు. అందుకే మన శరీరం చాలా గొప్పది.. ఇందులో పంచభూతాలు ఇమిడి ఉన్నాయని అంటారు భారతీయులు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం