AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరెరె.. ఎంతపనైంది.. పాపం బుజ్జి కుక్కకు ఎంతకష్టమొచ్చిందో.. హాట్సాఫ్‌ రెస్క్యూటీం..

అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వీడియో షేర్ చేయబడింది. దాని శీర్షిక ఇలా ఉంది. డాగ్ రెస్క్యూ విజయవంతమైంది. గత రాత్రి మా సిబ్బంది ఒక కన్స్ట్రక్షన్ సైట్‌లోని గొయ్యిలో 15 అడుగుల గొయ్యిలో పడిపోయిన ఒక

Viral Video: అరెరె.. ఎంతపనైంది.. పాపం బుజ్జి కుక్కకు ఎంతకష్టమొచ్చిందో.. హాట్సాఫ్‌ రెస్క్యూటీం..
Dog
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2022 | 10:02 PM

Share

Viral Video: జంతు రక్షణకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఇలాంటి సంఘటనలు కూడా వైరల్‌ అవుతుంటాయి. ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో లోతైన బోరుబావిలో పడిపోయిన ఒక గుడ్డి కుక్క ఎలా రక్షించబడిందో చూపిస్తుంది. ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వీడియో ఆధారంగా ఒక గుడ్డి కుక్క తన మానవ యార్డ్ నుండి తప్పించుకుని సమీపంలోని నిర్మాణ స్థలంలో ఉన్న15 అడుగుల లోతైన గుంటలో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని కుక్కకు సాయం చేశారు. చాలా శ్రమ తర్వాత 13 ఏళ్ల సీజర్ అనే కుక్కను బయటకు తీశారు.

అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వీడియో షేర్ చేయబడింది. దాని శీర్షిక ఇలా ఉంది. డాగ్ రెస్క్యూ విజయవంతమైంది. గత రాత్రి మా సిబ్బంది ఒక కన్స్ట్రక్షన్ సైట్‌లోని గొయ్యిలో 15 అడుగుల గొయ్యిలో పడిపోయిన ఒక గుడ్డి కుక్కను సాంకేతికంగా రక్షించారు. దాదాపు 13 నిమిషాలలో కుక్కను రక్షించారు. రెస్క్యూ తర్వాత కుక్కను రక్షించి దాని యజమానికి అప్పగించారు.

సహాయం చేసిన రెస్క్యూ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో ఒక రోజు క్రితం పోస్ట్ చేయబడింది. వేల సంఖ్యలో వ్యూస్‌, లైకులు, షేర్లతో వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి