Viral Video: దోస్త్ మేరా దోస్త్.. తాబేలుతో ఎంజాయ్ చేస్తున్న చిరుత.. హృదయాన్ని హత్తుకుంటున్న వీడియో..
Cheetah Plays With Tortoise: ఒక వ్యక్తి జీవితంలో.. ఎల్లప్పుడూ స్నేహితులు వెన్నుదన్నుగా నిలుస్తారు. ఒంటరి అనే భావనను దూరం చేసే.. ప్రతీ విషయంలో కీలకంగా ముందుండి నడిపిస్తారు.
Cheetah Plays With Tortoise: ఒక వ్యక్తి జీవితంలో.. ఎల్లప్పుడూ స్నేహితులు వెన్నుదన్నుగా నిలుస్తారు. ఒంటరి అనే భావనను దూరం చేసే.. ప్రతీ విషయంలో కీలకంగా ముందుండి నడిపిస్తారు. అందుకే స్నేహితులను కలిగి ఉండటం అదృష్టం అంటారు. కష్ట సుఖాల్లో తోడుంటే స్నేహితులతో మానసిక స్థితి మెరుగుపడటంతోపాటు.. అన్ని విషయాల్లో రాణించవచ్చని పేర్కొంటుంటారు పెద్దలు.. అందుకే స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ చాలా మంది పెద్దలు, రచయితలు చెబుతుంటారు. తాజాగా.. దానికి తగినట్లుగానే.. దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్.. అంటూ చిరుత, తాబేలు పార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన వైరల్ వీడియోను చూసి సోషల్ మీడియాలో (Social Media) నెటిజన్లు తెగ సంబరపడుతున్నారు. స్నేహమంటే ఇదేరా.. అంటూ వారి వారి దోస్తానా విషయాలను నెమరేసుకుంటున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. తాబేలు, చిరుత రెండూ ఏకాంతంగా ఒక దగ్గరికి చేరి సేదతీరుతున్నాయి. ఈ సమయంలో చిరుత తాబేలుకు ఏదో చెబుతున్నట్లు కనిపిస్తుంది. అయితే.. ఈ సందర్భంగా చిరుత తన మొహాన్ని తాబేలుకు రుద్దుతూ కనిపిస్తుంది. అలా తాబేలు రక్షణ కవచం పెంకుపై రుద్దుతూ ఆడుకుంటుంది. అవి రెండూ పార్క్‌లో సరదాగా గడుపుతున్న సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కార్సన్ స్ప్రింగ్స్ వైల్డ్‌లైఫ్.. మంచి స్నేహితులు అంటూ షేర్ చేసింది. కార్సన్ స్ప్రింగ్స్ యునైటెడ్ స్టేట్స్ ఫ్లోరిడాలోని గైనెస్‌విల్లేలో ఉన్న జంతువుల పార్క్.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి..
వైరల్ వీడియో చూడండి..
View this post on Instagram
వైరల్ క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పటి నుంచి దీనిని 1.1 మిలియన్ల మంది వీక్షించారు. ఇంకా వేలాది మంది లైక్ చేసి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ దృశ్యం చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అంటూ నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి