Health Tips: వామ్మో.. నిలబడి నీళ్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది..

మన శరీరానికి నీరు చాలా ముఖ్యమైనది. దాహాన్ని తీర్చడంతోపాటు.. శరీరాన్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మంచి ఆరోగ్యం కోసం రోజంతా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Health Tips: వామ్మో.. నిలబడి నీళ్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది..
Water
Follow us

|

Updated on: Sep 20, 2022 | 8:00 AM

Drinking Water Tips: మన శరీరానికి నీరు చాలా ముఖ్యమైనది. దాహాన్ని తీర్చడంతోపాటు.. శరీరాన్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మంచి ఆరోగ్యం కోసం రోజంతా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, నీరు తాగడమే కాదు.. మనం నీటిని ఎలా తాగుతాము అనేది కూడా చాలా ముఖ్యం అని పేర్కొంటున్నారు. చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు. నేటి ఉరుకులు పరుగుల హడావిడి జీవితంలో.. చాలామంది నీటిని నిలబడి తాగుతారు. ఏదో ఒక బిజీలో నేరుగా బాటిల్ నుంచి నీరు తాగుతారు. నిలబడి నీరు తాగడం వల్ల మనం అనేక వ్యాధులను ఆహ్వానిస్తున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి ఆరోగ్యానికి చాలా హానికరం. కావున, ఈరోజు నుంచే ఈ అలవాటును వదిలేయడం మంచిదని పేర్కొంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి రోగాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆక్సిజన్ సరఫరా దెబ్బతింటుంది: నిలబడి నీరు తాగినప్పుడల్లా శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. ఇది కాకుండా, ఆహారం, గాలి నాళాల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. దీని చెడు ప్రభావం ఊపిరితిత్తులపైనే కాదు గుండెపై కూడా ఉంటుంది. నిలబడి నీరు తాగడం వల్ల కడుపులో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇది పొత్తికడుపులో ఒత్తిడిని సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు హెర్నియా బాధితులుగా మారతారు.

ఒత్తిడి, ఉద్రిక్తత పెరుగుతుంది: నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. అవును, ఒత్తిడి పెరగడానికి ఈ అలవాటు కూడా ఒక ప్రధాన కారణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిలబడి నీరు తాగటం నాడీ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితిలో పోషకాలు శరీరానికి అందకపోవడంతోపాటు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

కీళ్ల నొప్పులు: నిలబడి నీళ్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయని పెద్దలు చెబుతుండటాన్ని మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇది పూర్తిగా నిజం.. నిలబడి నీళ్ళు తాగడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. దానివల్ల కీళ్లనొప్పుల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎముకలు కూడా బలహీనపడటం ప్రారంభమవుతాయి.

మూత్రపిండాలపై ప్రభావం: నిలబడి నీరు తాగే అలవాటు మీ మూత్రపిండాలపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి నిలబడి నీరు తాగినప్పుడల్లా.. నీరు ఫిల్టర్ కాకుండా దిగువ ఉదరం వైపు వేగంగా కదులుతుంది. దీంతో నీటి మలినాలు గాల్ బ్లాడర్‌లో నిక్షిప్తమవుతాయి. ఈ పరిస్థితి కిడ్నీకి చాలా హానికరం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..