Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: సన్నగా బలహీనంగా ఉన్నారా..? అరటిపండును ఇలా తింటే బరువు పెరిగి.. స్మార్ట్‌గా అవుతారు..

ప్రస్తుత కాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతుంటే.. మరికొంత మంది బరువు తక్కువ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సన్నగా, బరువు తక్కువగా ఉండటం వల్ల

Health Tips: సన్నగా బలహీనంగా ఉన్నారా..? అరటిపండును ఇలా తింటే బరువు పెరిగి.. స్మార్ట్‌గా అవుతారు..
Weight Gain
Shaik Madar Saheb
|

Updated on: Sep 18, 2022 | 4:20 PM

Share

How to eat banana for weight gain: ప్రస్తుత కాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతుంటే.. మరికొంత మంది బరువు తక్కువ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సన్నగా, బరువు తక్కువగా ఉండటం వల్ల, బరువు పెరిగేందుకు చాలా మంది ఏవేవో డైట్లు పాటిస్తున్నారు. సన్నని ఆకారం వారిలోని ఆత్మ విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని మంచి ఆకృతిలో చేయడం చాలా ముఖ్యం. మీ శరీరం చాలా బలహీనంగా, సన్నగా ఉంటే.. దీని కోసం మీరు మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా శరీరాన్ని లావుగా మార్చే కొన్ని పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అటువంటి పండ్లలో అరటిపండు నంబర్-1 స్థానంలో ఉంటుంది. అవును, అరటిపండు సహాయంతో మీరు శరీరాన్ని మంచి ఆకృతిలో మార్చుకోవచ్చు. అయితే, దీన్ని సరైన పద్ధతిలో తినడం అవసరం. సన్నగా ఉండే శరీరాన్ని లావుగా మార్చుకోవడానికి అరటిపండును ఎలా తినాలో ఇప్పడుు తెలుసుకుందాం..

వ్యాయామం తర్వాత 2 అరటిపండ్లు తినండి..

ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి వ్యాయామం తర్వాత 2 అరటిపండ్లు తినండి. ఇది మీ బరువును వేగంగా పెంచుతుంది. దీనితో పాటు కండరాల అభివృద్ధి కూడా మెరుగుపడుతుంది. కావున వ్యాయామం తర్వాత 2 అరటిపండ్లు తినడానికి ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

అల్పాహారంలో అరటిపండు తినండి..

మీ శరీరం చాలా సన్నగా ఉంటే అరటిపండును అల్పాహారంలో చేర్చుకోండి. తరచుగా చాలా మంది బరువు పెరగడానికి రాత్రిపూట అరటిపండు తింటారు. కానీ అది మీ శరీరానికి హాని కలిగిస్తుంది. అయితే, దానికి బదులు అల్పాహారంలో అరటిపండు తినడానికి ప్రయత్నించండి. అల్పాహారంలో అరటిపండును అనేక రకాలుగా తినవచ్చు. పాలు, అరటిపండు, ఇంకా బనానా షేక్ రూపంలో తీసుకోవచ్చు.

మధ్యాహ్న భోజనంలో పెరుగు – అరటిపండును తినండి..

శరీరం షేప్‌గా ఉండాలంటే మధ్యాహ్న భోజనంలో పెరుగు, అరటిపండు తీసుకోవాలి. ఇది మీ జీవక్రియ రేటును పెంచుతుంది. ఇంకా ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. పెరుగు అరటిపండు కలిపి తినడం మంచిది. పెరుగు-అరటిపండుతో జ్యూస్ లాగా చేసుకోని కొంచెం దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి కలపి కూడా తాగవచ్చు.

స్నాక్స్‌లో అరటిపండు తినండి..

బరువు పెరగడానికి స్నాక్స్‌లో అరటిపండు తినండి. దీని కోసం మీరు ఇంట్లో బాదం, అరటి, తేనెతో కలిపి తయారు చేసుకోవచ్చు. దీనితో మీ శరీరానికి ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరంగా బరువును పెంచుతుంది. దీనితో పాటు కండరాలు కూడా దృఢంగా తయారవుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..