Weight Loss: పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువట.. ఈ పద్దతులు అనుసరిస్తే ఊబకాయం హాంఫట్..

ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడం అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Weight Loss: పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువట.. ఈ పద్దతులు అనుసరిస్తే ఊబకాయం హాంఫట్..
Weight Loss
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 17, 2022 | 9:43 PM

Weight Loss Tips For Men: ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడం అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. ఊబకాయం అనేక వ్యాధులకు దారి తీస్తుంది. దీని వల్ల అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి. ఈ సమస్యను పురుషులు, మహిళలు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఎక్కువగా పురుషులు మాత్రమే ఈ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి పలు కారణాల వల్ల ముఖ్యంగా పురుషుల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల అలాంటి వారు కూర్చోవడం, నడవడం, దుస్తులు ధరించడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు.

చాలా మంది పురుషుల్లో బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో పురుషులు వ్యాయామశాలను ఆశ్రయిస్తారు. బరువు తగ్గడం కోసం ఏవేవో డైట్లు పాటిస్తూ నిత్యం పరిగెత్తుతుంటారు. కానీ.. ఇది ఎక్కువగా ప్రయోజనాన్ని చేకూర్చదు. ఎన్ని డైట్లు అనుసరించిన బరువు అలానే ఉండి.. ఊబకాయం తగ్గడం కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా బరువు తగ్గడం గురించి ఆలోచిస్తుంటే.. కొన్ని పద్ధతులను అనుసరించాలని సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి పురుషులు ఎలాంటి పద్దతులు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకోండి..

పురుషులు ఈ మార్గాల్లో బరువు తగ్గించుకోవచ్చు..

ఇవి కూడా చదవండి

ఆహారం: చాలా సార్లు ప్రజలు నిర్దిష్ట సమయంలో బరువు తగ్గించుకోవడం కోసం కఠినమైన ఆహారాన్ని అనుసరిస్తారు. అయితే.. ఆ పద్దతులను అకస్మాత్తుగా మానేస్తే.. మళ్లీ బరువు పెరగడం ప్రారంభమవుతుంది. దానిని నియంత్రించడం కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో ఆహారం తగ్గించాలని ఆలోచిస్తుంటే, అది శరీరంలో పోషకాల కొరతకు దారితీస్తుంది. అయితే.. బరువు తగ్గడానికి ఏమైనా ఆహారాన్ని అనుసరిస్తే ఎల్లప్పుడూ దానిని అనుసరించడం మంచిది. ఇంకా శరీరంలో పోషకాలకు లోటు రాని విధంగా ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామం: పురుషులు త్వరగా బరువు తగ్గడానికి ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల వ్యాయామం చేయాలి. దీని కారణంగా వారి ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు బరువు కూడా వేగంగా తగ్గుతుంది. మరోవైపు, మీరు జిమ్‌కు వెళ్లలేకపోతే సాధారణంగా కొంత దూరం పాటు నడిస్తే మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?