Amla Side Effects: ఆ సమస్యలున్న వారు ఉసిరికాయలను అస్సలు తినకూడదు.. అలా చేస్తే ఇబ్బందుల్లో పడినట్లే..
ఉసిరికాయంలో విటమిన్, ఎ, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. అయితే, ఉసిరి కొందరికి హాని కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Side Effects Of Amla: ఉసిరికాయలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఉసిరి ప్రతి సీజన్లో తినదగిన ఆహారం. ఉసిరి ఆరోగ్యంతోపాటు.. అందాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరి నుండి అనేక రకాల వస్తువులను కూడా తయారు చేస్తారు. అందుకే ఉసిరిని ప్రయోజనకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఉసిరికాయంలో విటమిన్, ఎ, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. అయితే, ఉసిరి కొందరికి హాని కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమందికి ఉసిరికాయ వినియోగం ప్రయోజనకరమైనది కాదంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఎలాంటి వ్యక్తులు ఉసిరిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వ్యక్తులు ఉసిరికాయను తినకూడదు
ఇవి కూడా చదవండి
- రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నవారు: రక్తంలో చక్కెర తక్కువగా ఉన్న వారు ఉసిరిని మితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తక్కువ బ్లడ్ షుగర్ తో బాధపడుతున్నవారు ఉసిరి తినడం మానుకుంటే మంచిది.
- అసిడిటీ: అసిడిటీ సమస్య ఉన్నట్లయితే ఎక్కువ ఉసిరిని తినకుండా ఉండాలి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది హైపర్ యాసిడిటీ ఉన్నవారి సమస్యలను పెంచుతుంది.
- సర్జరీ: ఏదైనా శస్త్రచికిత్స జరిగి ఉంటే కొన్ని రోజులపాటు ఉసిరికాయలను తినకుండా ఉండండి. ఎందుకంటే రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది.
- డీహైడ్రేషన్: డీహైడ్రేషన్ సమస్య ఉంటే ఉసిరిని తినకుండా ఉండాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..