AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Habit For Diabetes: ఈ అలవాట్లు ఉంటే ఈరోజే మానుకోండి.. లేకుంటే మీరు డయాబెటిక్ పేషెంట్ అవుతారు..

కొన్ని రోజువారీ అలవాట్ల వల్ల మీకు మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచే అలాంటి కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం..

Habit For Diabetes: ఈ అలవాట్లు ఉంటే ఈరోజే మానుకోండి.. లేకుంటే మీరు డయాబెటిక్ పేషెంట్ అవుతారు..
Diabetic
Sanjay Kasula
|

Updated on: Sep 18, 2022 | 6:47 AM

Share

ఈ రోజుల్లో మారుతున్న ప్రజల జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. వీటిలో మధుమేహం కూడా ఒకటి. నేటి కాలంలో లక్షలాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. కొన్ని రోజువారీ అలవాట్ల వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మందికి దీనిపై అవగాహన లేదు. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచే అలాంటి కొన్ని అలవాట్ల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.

నిదానమైన జీవనశైలి

ప్రతి ఒక్కరూ విశ్రాంతిని ఇష్టపడతారు. కానీ ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం లేదా పడుకోవడం.. ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం వల్ల గుండె, ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుంది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో నిపుణులు ఈ వివరాలను వెల్లడించారు. రోజులో ఎక్కువ సమయం కూర్చొని గడిపే వ్యక్తులకు ఇతర వ్యక్తుల కంటే మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అందుకే పని చేస్తున్న చోటు నుంచి కాసేపయ్యాక సీట్లోంచి లేచి అటూ ఇటూ తిరగాలి.

నిద్ర లేకపోవడం

రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రిపూట మేల్కొని ఉండడం వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల, దీనిని నివారించడానికి, మీరు రాత్రిపూట కనీసం 8 గంటలు నిద్రపోవాలి.

ఒత్తిడి

ఒత్తిడికి మధుమేహానికి నేరుగా సంబంధం లేదని చాలా అధ్యయనాలు కనుగొన్నాయి. కానీ ఇది ఖచ్చితంగా ఒక కారకంగా చెప్పవచ్చు. నిజానికి, ఒత్తిడి కారణంగా, శరీరంలో ‘కార్టిసాల్’ అనే హార్మోన్ పెరగడం మొదలవుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిపై వేగాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక కార్టిసాల్ రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఈ విధంగా, ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?