- Telugu News Photo Gallery Skin care tips: turmeric powder is beneficial for body allergy deets in telugu
Skin Care Tips: స్కిన్ అలెర్జీతో ఇబ్బంది పడుతున్నారా.. పసుపుతో చికిత్స.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
భారతీయుల వంటిల్లే ఒక ఔషధ శాల. పసుపు దగ్గు, జలుబు లేదా గాయాలను నయం చేయడానికి ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. పసుపును అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.
Updated on: Sep 17, 2022 | 7:25 PM

పసుపును వివిధ వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు పసుపును ఆయుర్వేదంలో లక్షణాల నిధిగా కూడా వర్ణించారు. అలాగే పసుపును దశాబ్దాలుగా హోం రెమెడీగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా చర్మంలో గ్లో పెరగడానికి పసుపును ఉపయోగించవచ్చు.

చర్మం అలెర్జీ బారిన పడితే.. అటువంటి అలెర్జీలు తగ్గించడంలో పసుపు సహాయపడుతుంది. ఒక వ్యక్తి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల అలెర్జీలు పెరుగుతాయి. ఇటువంటి అలర్జీలకు పసుపుతో చికిత్స చేయవచ్చు

వాతావరణంలో చోటు చేసుకునే మార్పులతో కొంతమందికి అలర్జీ సమస్య కూడా పెరుగుతోంది. శరీరంలోని తెల్ల రక్త కణాలు అలెర్జీ కారకమైన ఇమ్యునోగ్లోబులిన్ E ని ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల అలర్జీలు పెరగడం మొదలవుతుంది. అలర్జీలను తగ్గించడానికి పసుపు మంచి ఎంపిక.

పసుపు కూడా యాంటీ బయోటిక్ లక్షణాలతో కూడిన ఒక రకమైన హెర్బ్. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అలర్జీని దూరం చేసుకోవచ్చు. పసుపు శరీరంలో మంటకు కారణమయ్యే ఎంజైమ్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎలాంటి అలర్జీనైనా తగ్గించుకోవడానికి పసుపు పాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. పసుపు, తేనె టీ తాగడం ద్వారా అలెర్జీలు నయం అవుతాయి. రోజుకు ఒక్కసారైనా పసుపు నీరు తాగడం వల్ల అలర్జీ లక్షణాలను తగ్గించుకోవచ్చు.




