- Telugu News Photo Gallery Spiritual photos according to chanakya neeti women like these man in telugu
Chanakya Niti: ఇలాంటి లక్షణాలు ఉన్న పురుషులు.. మహిళలకు భర్తగా మొదటి ఎంపిక.. అందులో మీరున్నారా..
ప్రతి అమ్మాయి తన కాబోయే భాగస్వామిని చూడ్డానికి బాగుండడమే కాకుండా అతని అలవాట్లు కూడా హృదయాన్ని కదిలించేలా ఉండాలని కలలు కంటుంది. అలాంటి వ్యక్తి అమ్మాయిని నిజంగా ప్రేమిస్తాడని.. తన జీవితం సంతోషంగా సాగుతుందని అమ్మాయి భావిస్తుంది.
Updated on: Sep 18, 2022 | 5:45 PM

అసూయ: కోపంలా అసూయ కూడా మనిషికి అతి పెద్ద శత్రువు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అసూయ మనిషిని ముందుకు సాగనివ్వదు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ తనతో పాటు, ఇతరుల విజయానికి కూడా అడ్డుగా ఉంటాడు.

మోసం చేయడం ద్వారా - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మోసం చేసి సంపాదించిన డబ్బు ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిలబడదు. ఎంత ధనం, సిరి సంపదలున్నా అలాంటి వ్యక్తులను.. ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఎవరూ గౌరవించరు

చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.

చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.

స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.




