- Telugu News Human Interest Cheetahs return to india know how many kind of big cats found in world and interesting facts about all 8 big cats
ప్రపంచంలో ఎన్ని రకాల ‘పిల్లులు’ ఉన్నాయో తెలుసా..! సింహాలు, చిరుతల సహా అనేక జంతువులు ‘పిల్లి’ కుటుంబంలో సభ్యులే..
బిగ్ క్యాట్ ఫ్యామిలీ అంటే పిల్లులు మాత్రమే అని చాలా మంది అనుకుంటారు, అయితే అది నిజం కాదు. బిగ్ క్యాట్ ఫ్యామిలీలోని 8 విభిన్న వర్గాలు ఉన్నాయి. వీటిల్లో కౄర జంతువులైన సింహాలు, చిరుతలు కూడా సభ్యులే.
Updated on: Sep 17, 2022 | 8:33 PM

ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి 8 చిరుతలను భారత్‌కు తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దేశంలో మరోసారి చర్చ మొదలైంది. బిగ్ క్యాట్ ఫ్యామిలీ గురించి చర్చ మొదలైంది. బిగ్ క్యాట్ ఫ్యామిలీ అంటే పిల్లులు మాత్రమే అని చాలా మంది అనుకుంటారు, అయితే నిజం కాదు. ప్రపంచంలో 38 రకాల పిల్లలు ఉన్నాయి, వీటిని 8 వర్గాలుగా విభజించారు. వీటిలో సాధారణ పిల్లి నుండి సింహం, చిరుత, పులి, చిరుత వంటి జంతువులు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక పేరు పెట్టారు. అది బిగ్ క్యాట్ ఫ్యామిలీ. ఒకే విధంగా చూడటం, వేటాడటం వంటి లక్షణాల కలిగి ఉన్నాయి. ఇవన్నీ ఒక సమూహంలో ఉంచబడ్డాయి. బిగ్ క్యాట్ ఫ్యామిలీలోని 8 విభిన్న వర్గాల్లో ఏ జంతువులు చేర్చబడ్డాయో తెలుసుకోండి.

బిగ్‌క్యాట్ కుటుంబంలో మొదటి భాగం సింహం. ఇవి అడవికి రాజు. ఇవి గర్జన, వేట లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.

క్లాడెడ్ చిరుతపులి గురించి చాలా తక్కువగా తెలుసు. ఇవి సులభంగా చెట్లను ఎక్కుతాయి. అంతే కాదు పొడవాటి కాళ్లు, బలమైన గోళ్ల సాయంతో చెట్టు కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి.

తదుపరి జంతువు మంచు చిరుత. దీనిని 'ఘోస్ట్ ఆఫ్ మౌంటైన్' అని కూడా పిలుస్తారు. చాలా అరుదుగా కనిపించడమే దీనికి కారణం. ఎక్కువ సమయం ఒంటరిగా ఉంటుంది. మంచులో కూడా సజీవంగా ఉండగల సామర్థ్యం దీనికి ఉంది.ప్రత్యేకత ఏమిటంటే ఇవి గర్జించవు.

జాగ్వర్లు ముఖ్యంగా బలమైన పంజాలకు ప్రసిద్ధి చెందాయి. దీని పంజాలు చాలా బలంగా ఉంటాయి. ఇది పంజా విసిరితే.. తాబేలు పై భాగం కూడా విరిగిపోతుంది. జాగ్వర్లు తమ పంజా సహాయంతో వేటాడుతాయి. తనకు ఇష్టమైన ఆహారాన్ని తింటాయి.

పిల్లుల కుటుంబంలో మరొక సభ్యుడు చిరుతపులి. పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన కొన్ని ప్రజాతుల జంతువుల్ని చిరుతపులులు లేదా చిరుతలు అంటారు. ఇవి పులులు, సింహాలతో కలిపి ఉన్న పాంతెరా జాతికి చెందింది. చిరుతపులి తన వేటను పట్టుకుని చెట్టు కిందికి చేరుకుంటుంది. అక్కడ తీరికగా తింటుంది.

టైగర్ అంటేపెద్దపులి.. ఇవి పెంపుడు పిల్లులకు అతిపెద్ద వెర్షన్ అని అంటారు. వీటికి నీటికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇవి నీటిలో ఈదగలవు, వేటాడగలవు.

చిరుత కూడా బిగ్ క్యాట్ కుటుంబంలో సభ్యుడు. గంటకు 60 మైళ్ల వేగంతో పరిగెత్తే భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా పేరుగాంచింది.





























