Health Tips: మైక్రోవేవ్‌‌ ఓవెన్‌లో పొరపాటున కూడా ఈ పదార్థాలను వేడి చేయకండి.. అలా చేస్తే విషం తిన్నట్లే..!

ఉరుకులు పరుగుల హడావిడి జీవితంలో చాలామంది బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు రోజువారి పని, మరోవైపు కుటుంబ బాధ్యతలతో ఎవరికీ సమయం దొరకడం లేదు.

Health Tips: మైక్రోవేవ్‌‌ ఓవెన్‌లో పొరపాటున కూడా ఈ పదార్థాలను వేడి చేయకండి.. అలా చేస్తే విషం తిన్నట్లే..!
Microwave Oven
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 16, 2022 | 3:49 PM

Microwave Oven : ఉరుకులు పరుగుల హడావిడి జీవితంలో చాలామంది బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు రోజువారి పని, మరోవైపు కుటుంబ బాధ్యతలతో ఎవరికీ సమయం దొరకడం లేదు. టెక్నాలజీ మన బిజీ లైఫ్‌ని కొంచెం సులభతరం చేసింది. ఫోన్ కాల్ లేదా మెస్సెజ్ చేయడం ద్వారా మన సందేశాన్ని కొన్ని సెకన్లలో మరొక వ్యక్తికి తెలియజేయవచ్చు. కారుని ఉపయోగించి కొన్ని గంటల్లో ఒక నగరం నుంచి మరొక నగరానికి ప్రయాణం చేయవచ్చు. ఫ్లైట్ ద్వారా కొన్ని నిమిషాల్లో దేశాలను దాటొచ్చు. ఇంకా అరచేతిలోని సెల్ తో నిమిషాల్లోనే ఆహారాన్ని తెప్పించుకోవచ్చు. అయితే, బిజీ షెడ్యూల్ కారణంగా ప్రజలకు ఆహారం వండడానికి సమయం దొరకడం లేదు. అటువంటి పరిస్థితిలో మైక్రోవేవ్‌లో ఆహారాన్ని ఉడికించడం చాలా సులభం. ఎందుకంటే ఆహారం చాలా తక్కువ సమయంలో తయారవుతుంది. అయితే, మీరు కూడా మైక్రోవేవ్‌లో వంట చేస్తున్నట్లయితే.. కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మైక్రోవేవ్‌లో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు వేడి చేయకూడదు. అలాచేస్తే.. క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పుట్టగొడుగులు: పుట్టగొడుగులు తినడానికి రుచిగా ఉంటాయి. అవి చాలా ఆరోగ్యకరమైనవి కూడా. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. పుట్టగొడుగులను మైక్రోవేవ్‌లో వేడి చేసినప్పుడు దానిలోని అన్ని పోషకాలు పోతాయి. అంతే కాకుండా మైక్రోవేవ్‌లో వేడిచేసిన పుట్టగొడుగులను తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి.

గుడ్డు: గుడ్డును మర్చిపోయి కూడా మైక్రోవేవ్‌లో ఉడకబెట్టకండి. ఇలా చేయడం వల్ల గుడ్డు సరిగా ఉడకదు. ఎందుకంటే మైక్రోవేవ్‌లో గుడ్డు ఉడకబెట్టినప్పుడు, దాని లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని కారణంగా గుడ్డు భాగాలుగా విడిపోతుంది. ఇది కాకుండా మైక్రోవేవ్‌లో వేడి చేస్తే దానిలోని పోషకాలు కూడా పోతాయి.

ఇవి కూడా చదవండి

రైస్: మైక్రోవేవ్‌లో అన్నం వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. మైక్రోవేవ్‌లో రైస్‌ని వేడి చేసుకోవడం వల్ల ఇది బాసిల్లస్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇది విరేచనాలు, జీర్ణక్రియ వంటి సమస్యలను కలిగిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..