Health: మీ శరీరం నుంచి దుర్వాసన వస్తోందా.? అయితే ఆ వ్యాధితో బాధపడుతున్నట్లే.. బీ కేర్ ఫుల్..
Diabetes Symptoms: ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ మొదటి స్థానంలో ఉంటుంది. మరీ ముఖ్యంగా భారతీయుల్లో ఈ వ్యాధి రోజురోజుకీ పెరిగిపోతోంది. 30 ఏళ్లు దాటిన వారు కూడా డయాబెటిస్ బారిన...
Diabetes Symptoms: ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ మొదటి స్థానంలో ఉంటుంది. మరీ ముఖ్యంగా భారతీయుల్లో ఈ వ్యాధి రోజురోజుకీ పెరిగిపోతోంది. 30 ఏళ్లు దాటిన వారు కూడా డయాబెటిస్ బారిన పడుతుండడం ఆందోళన కలిగించే అంశం. మారుతోన్న జీవనశైలి, తీసుకునే ఆహారం కారణంగా షుగర్ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. అయితే మంచి జీవన విధానంతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవడం అంత పెద్ద విషయమేమి కాదు. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, వర్కవుట్ చేస్తే షుగర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే షుగర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని లక్షణాల ద్వారా షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాల్లో శరీరం నుంచి వచ్చే దుర్వాసన ఒకటని మీలో ఎంత మందికి తెలుసు.? దుర్వాసనకు, షుగర్ వ్యాధికి సంబంధం ఏంటనేగా మీ సందేహం.. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..
షుగర్ వ్యాధి వల్ల కలిగే దుష్ప్రభావాలలో డయాబెటిస్ కీటోయాసిడోసిన్ ఒకటి. శరీరంలో తగినంత ఇన్సూలిన్ లేని సమయంలో ఈ రకమైన ప్రభావం ఏర్పడుతుంది. ఇలాంటి సమయాల్లో కాలేయం కొవ్వును కరిగిస్తుంది. దీనివల్ల రక్తం, మూత్రంలో కీటోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ కారణంగా రక్తంలో యాసిడ్ స్థాయి పెరుగుతుంది. దీని ఫలితమే శరీరం నుంచి దుర్వాసన రావడం. శరీరంలో కీటోన్స్ పెరగడం వల్ల నోటి నుంచి పండ్ల వాసన వస్తుంది. అలాగే కొందరిలో నోటిలో నుంచి దుర్వాసన వస్తుంది. ఇక అమ్మోనియా వంటి వాసన, సాధారణంగా దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం ఉన్నవారిలో సంభవిస్తుంది.
ముఖ్యంగా టైప్1 డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగే వారిలో దుర్వాసన సమస్య వేధిస్తుంటుంది. అయితే డయాబెటిస్ లేని వారిలోని కిటోయాసిడోసిస్ స్థాయి పెరిగే అవకాశం ఉంది. శరీరంలో సరిపడ గ్లూకోజ్ లేని సమయంలో ఈ సమస్య వేధిస్తుంది. శరీరంలో కిటోయాసిడోస్ పెరగడం వల్ల కనిపించే లక్షణాల్లో వాంతులు, కడుపులో నొప్పి, బరువుతగ్గడం, తీవ్రమైన అలసట, విపరీతమైమ మూత్ర విసర్జన వంటి లక్షణాలు సైతం కనిపిస్తాయి.
నోట్: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే అందించినది. ఆరోగ్య సంబంధిత వివరాల్లో ఎప్పుడైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే చికిత్స తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..