AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ 15 నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు.. లెక్కలేనన్ని ప్రయోజనాలు..

చలికాలంలో రమ్ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. రమ్ నిజంగా తాత్కాలిక వెచ్చదనాన్ని అందిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మసాజ్ కోసం కూడా ఉపయోగిస్తారు. అయితే, ఇది ఔషధం కాదు. దీని ప్రభావం తాత్కాలికం. అధిక వినియోగం హానికరం కాబట్టి, మితంగా వాడాలి.

రోజూ 15 నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు.. లెక్కలేనన్ని ప్రయోజనాలు..
Rum Massage In Winter
Jyothi Gadda
|

Updated on: Dec 05, 2025 | 6:45 PM

Share

చలికాలంలో రమ్‌ తీసుకోవడం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు. అంతేకాదు. కొంతమంది వారి ఇళ్లలో రమ్‌తో మసాజ్ చేయడం కూడా అమ్మమ్మల మందులలో ఒక భాగంగా వస్తోంది. కానీ, రమ్ నిజంగా శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా ..? అది కేవలం మాట వరుసకు మాత్రమే చెబుతారా..? వాస్తవం ఏమిటంటే రమ్ ఖచ్చితంగా శరీరంలో తాత్కాలిక వెచ్చదనాన్ని కలిగిస్తుంది. ఇది జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొంతమంది జలుబు, దగ్గు సమయంలో గొంతుకు ఉపశమనం కలిగించడానికి రమ్‌ తీసుకుంటారు. కానీ, రమ్ ఒక ఆల్కహాల్ పానీయం అని, సరైన పరిమాణంలో మాత్రమే దీనిని ఉపయోగించడం మంచిది. ఎందుకంటే..అధిక వినియోగం ప్రయోజనం కంటే హాని కలిగిస్తుంది.

జలుబుకు రమ్ మంచిదా?

రమ్ శరీరంలోని రక్త నాళాలను కొద్దిగా విశాలం చేస్తుంది. దీనివల్ల తాత్కాలిక వెచ్చదనం కలుగుతుంది. అందుకే చాలా మంది చలిలో రమ్‌ ఉపశమనం కలిగిస్తుందని వాడుతుంటారు. తేలికపాటి గొంతు నొప్పి, జలుబు కూడా ఛాతీకి వెచ్చదనం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఇది ఔషధం కాదు, దాని ప్రభావం తాత్కాలికమే. జలుబు తీవ్రంగా ఉంటే, వైద్యుడి సంప్రదించడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

రమ్-ఆల్కహాల్ మసాజ్ ఎలా చేయాలి?

రమ్ మసాజ్ అనేది పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయ గృహ నివారణ. చేతుల్లో కొద్ది మొత్తంలో రమ్ తీసుకొని సన్నని సెగ తగిలేలా వేడి చేయాలి. లేదా వెచ్చదనం కోసం నేరుగా అరచేతులపై రుద్దండి. తరువాత, దానిని వీపు ఛాతీ లేదా కీళ్లపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఆల్కహాల్ చర్మంపై చల్లగా అనిపిస్తుంది. కానీ కొంత సమయం తర్వాత, రక్త ప్రసరణ పెరగడం వల్ల అది వేడెక్కుతుంది. చలికారణంగా పగిలిన చర్మం తిరిగి సున్నితంగా మారేలా చేస్తుంది.

రమ్ తో మసాజ్ చేస్తే ఏమవుతుంది?

రమ్ తో మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రియం అవుతుంది. వెచ్చదనం, కొంచెం విశ్రాంతి లభిస్తుంది. చాలా మంది దీనిని జలుబు, అలసట లేదా కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఇంటి నివారణగా ఉపయోగిస్తారు. రమ్‌ మసాజ్‌తో కలిగే సువాసన, వెచ్చదనం వల్ల మానసిక స్థితిని కూడా శాంతపరుస్తుంది. అయితే, దాని ప్రభావాలు తేలికపాటివి. తాత్కాలికమైనవి.

రమ్ ఎముకలకు, కీళ్లకు మంచిదా?

రమ్ నేరుగా ఎముకలను బలోపేతం చేయదు. అయితే, రమ్ మసాజ్ నుండి వచ్చే వెచ్చదనం కీళ్ల నొప్పులు, దృఢత్వం నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చు. అయితే కాల్షియం, విటమిన్ డి, సరైన ఆహారం ఎముకల బలానికి నిజమైన పరిష్కారాలు.

శీతాకాలంలో రమ్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

శరీరానికి తాత్కాలిక వెచ్చదనం అందుతుంది. తేలికపాటి గొంతు నొప్పి, జలుబు విషయంలో ఇది కొన్ని నిమిషాలు ఉప శమనం కలిగిస్తుంది. ఒత్తిడి, చలి కాలంలో మీకు కాస్త రిలాక్స్‌గా అనిపించవచ్చు. ఈ ప్రయోజనాలు పరిమిత పరిమాణంలో లభిస్తాయి. అంతేగానీ, ఇది ఆరోగ్య చికిత్స కాదని నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..