Health Tips: తినే సమయంలో నీరు తాగడం మంచిదా.. కాదా.. నిపుణులు ఏమంటున్నారంటే..
మనం తినేటప్పుడు నీరు తాగవచ్చా.. లేదా అనేది పెద్ద సందేహం.. సాధారణంగా అత్యవసరమైనప్పుడు.. ముద్ద గొంతులో దిగనప్పుడు నీరు తాగుతాం. కాని జనరల్ గా తినేటప్పుడు నీరు..
Health Tips: మనం తినేటప్పుడు నీరు తాగవచ్చా.. లేదా అనేది పెద్ద సందేహం.. సాధారణంగా అత్యవసరమైనప్పుడు.. ముద్ద గొంతులో దిగనప్పుడు నీరు తాగుతాం. కాని జనరల్ గా తినేటప్పుడు నీరు తాగకూడదని, తిన్న తర్వాత తాగాలని చాలామంది సూచిస్తుంటారు. కాని ఈవిషయంలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఆహారం తినే సమయంలో గానీ, తిన్న తర్వాత వెంటనే గానీ నీరు తాగడం మంచిది కాదనుకుంటారు. ఆహారం తింటూ నీరు తాగితే అది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కొంత మంది ఆయుర్వేద నిపుణులు కూడా భోజనం చేయటానికి ముందు, చేసిన తర్వాత నీళ్లు తాగటానికి కనీసం అరగంట వ్యవధి ఇవ్వాలని సూచిస్తారు. అసలు తినేటప్పుడు నీరు తాగడం మంచిదా కాదా అనేదానిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
భోజనం చేస్తున్నప్పుడు కూడా నీరు తాగొచ్చు. వాస్తవానికి నీరు ఎప్పుడు తాగినా మంచిదేనని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి ముందు గానీ, భోజనం చేసేటపుడు గానీ, భోజనం తర్వాత గానీ నీరు తాగితే జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేస్తుంది. తద్వారా జీర్ణక్రియ నెమ్మదవుతుంది అనే అభిప్రాయానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు నిపుణులు. భోజన సమయంలో నీరు తాగడాన్ని నివారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
మనం ఆహారంలోనే చాలా నీరు ఉంటుంది. భారతీయులు సూప్‌లు, రసాలు వంటి పలుచని ఆహారం తింటారు వాటిలో నీరు ఉంటుంది. అలాగే సలాడ్లు తింటారు అందులోనూ నీరు ఉంటుంది. కూరగాయల్లో నీరు ఉంటుంది, పెరుగు, మజ్జిగల్లోనూ నీరే ఉంటుంది. అంతేకాదు మనం ఆహారాన్ని నమలడం ద్వారా ఉత్పత్తి అయ్యే లాలాజలంలోనూ నీరే ఉంటుంది. మనం తినే సాంప్రదాయ ఆహారంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, అది ఏ విధంగానూ జీర్ణక్రియను ప్రభావితం చేయదు. కాబట్టి నీరు తాగకూడదు అనే దానిలో అర్థం లేదని పోషకాహార నిపుణులు అంటున్నారు.
చాలా మంది భోజనంతో నీరు తాగకూడదనే విధానం అనుసరిస్తారు. కొంతమంది గంట, 2 గంటల వరకు కూడా చుక్క నీరు తీసుకోరు. అయితే దీనివల్ల నిర్జలీకరణానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలా డీహైడ్రేషన్ కు గురైనపుడు దీర్ఘకాలిక మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఇప్పటికే నిరూపితమైందని చెబుతున్నారు. సాధారణ వ్యక్తి ప్రతిరోజూ 3 లేదా 4 లీటర్ల నీటిని తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..