Viral Video: కదులుతున్న రైలు నుంచి సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. ప్రయాణికులకు చిక్కి నరకం చూసిన దొంగ.. వీడియో వైరల్

Shocking Video: కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్‌ ఫోన్‌ చోరీ చేయాలనుకున్న దొంగకు భయంకరమైన అనుభవం ఎదురైంది. అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేయిని పట్టుకోవడంతో సుమారు పది కిలోమీటర్ల వరకు ఆ దొంగ రైలు కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు.

Viral Video: కదులుతున్న రైలు నుంచి సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. ప్రయాణికులకు చిక్కి నరకం చూసిన దొంగ.. వీడియో వైరల్
Thief
Follow us

|

Updated on: Sep 15, 2022 | 9:17 PM

Shocking Video: కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్‌ ఫోన్‌ చోరీ చేయాలనుకున్న దొంగకు భయంకరమైన అనుభవం ఎదురైంది. అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేయిని పట్టుకోవడంతో సుమారు పది కిలోమీటర్ల వరకు ఆ దొంగ రైలు కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు. బిహార్లోని ఖగారియాలో ఈ సంఘటన జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బిహార్లోని బెగుసరాయ్‌ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలు సాహెబ్‌పూర్‌ కమల్‌ స్టేషన్‌లో ఆగింది. ఇంతలో ఒక దొంగ తన చేతివాటం ప్రదర్శించాలనుకున్నాడు. రైలు బోగి కిటీకి నుంచి ఒక ప్రయాణికుడి మొబైల్‌ను తస్కరించాలని చూశాడు. అయితే వెంటనే స్పందించిన ప్రయాణికులు ఆ దొంగ చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆ రైలు ప్లాట్‌ఫామ్‌ చివరకు చేరిన తర్వాత మరింత వేగం పుంజుకుంది. అయితే ప్రయాణికులు దొంగ చేతిని వదిలిపెట్టలేదు.

కాగా తనను క్షమించాలని, తన చేతులు విడిచిపెట్టమని వేడుకున్నా ప్రయాణికులు విడిచిపెట్టలేదు. మరింత గట్టిగా లోపలకు లాగి పట్టుకున్నారు. దీంతో ఆ దొంగ రైలు బోగి కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు. ఆ రైలు పది కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఖగారియా స్టేషన్‌ సమీపిస్తుండగా ఆ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టారు. దీంతో ఆ దొంగ అక్కడి నుంచి పారి పోయాడు. అదే కంపార్ట్‌మెంట్‌లోని కొందరు ప్రయాణికులు ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ప్రయాణికులు దొంగపై కాస్తా చాలి చూపించాల్సిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..