కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం

33 ఏళ్ల వయసున్న ఓ మహిళ.. తీవ్రమైన కడుపునొప్పితో దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడున్న వైద్యులు ఆమెకు టెస్టులు చేశారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసి షాక్ తిన్నారు.

Phani CH

|

Sep 15, 2022 | 8:52 PM

33 ఏళ్ల వయసున్న ఓ మహిళ.. తీవ్రమైన కడుపునొప్పితో దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడున్న వైద్యులు ఆమెకు టెస్టులు చేశారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసి షాక్ తిన్నారు. వెలుగులోకి వచ్చిన ఆ స్టన్నింగ్ నిజాన్ని ఆమెకు చెప్పగా.. బాధితురాలు ఒక్కసారిగా లబోదిబోమంది. అసలేం జరిగిందంటే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన 33 ఏళ్ల సునీతాదేవి.. తీవ్రమైన కడుపునొప్పితో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లింది. అక్కడున్న వైద్యులు ఆమెకు టెస్టులు చేసి.. గర్భాశయం తొలగించాలని చెప్పారు. దీంతో సునీతాదేవి కుటుంబసభ్యులు 30 వేల రూపాయలు ఖర్చుపెట్టి సెప్టెంబర్ 3వ తేదీన శస్త్రచికిత్స చేయించారు. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. అయితే ఆ మరుసటి రోజు నుంచే సునీతా దేవి ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారింది. ఆందో ఆమె కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 5వ తేదీన పాట్నా మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి డాక్టర్లు సునీతను పరీక్షించి.. షాకింగ్ నిజాన్ని చెప్పారు. ఆమె శరీరంలో రెండు కిడ్నీలు లేవని తెలిపారు. దీంతో ఒక్కసారిగా సునీత కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కిడ్నీలు పోవడమేంటంటూ లబోదిబోమన్నారు. కాగా, సదరు క్లినిక్ నిర్వాహకుడిపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతడిపై మానవ అవయవాల మార్పిడి చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీల్‌ఛైర్‌లో ఫుడ్‌ డెలివరీ చేస్తోన్న యువతి !! హ్యాట్సాఫ్‌ అంటోన్న నెటిజన్లు

డయానా ఉసురు తగిలింది.. ఆమె మహారాణి అయినా ఏం లాభం ??

మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు..

బ్రేక్ వేయబోతుండగా బస్సు డ్రైవర్‌కు ఊహించని షాక్ !! కనిపించిన నాగుపాము.. చివరికి ఏం జరిగిందంటే ??

Digital TOP 9 NEWS: కీడు సోకిందంటూ చెట్ల కింద ఉంటున్న గ్రామస్తులు | పది అడుగుల పాము బుసలు కొడితే..

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu