బ్రేక్ వేయబోతుండగా బస్సు డ్రైవర్‌కు ఊహించని షాక్ !! కనిపించిన నాగుపాము.. చివరికి ఏం జరిగిందంటే ??

బ్రేక్ వేయబోతుండగా బస్సు డ్రైవర్‌కు ఊహించని షాక్ !! కనిపించిన నాగుపాము.. చివరికి ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Sep 15, 2022 | 8:42 PM

ఇటీవల కాలంలో పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడి పడితే అక్కడ పాములు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాముకాటుకు గురికాక తప్పదు.

ఇటీవల కాలంలో పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడి పడితే అక్కడ పాములు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాముకాటుకు గురికాక తప్పదు. తాజాగా ఓ బస్సు డ్రైవర్ తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకోగా.. ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా జయపుర గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోజూలానే ఆ డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక ప్రాంతంలో బ్రేక్ వేద్దామని.. పెడల్‌పై కాలు వేయబోయాడు. అంతే అక్కడ ఓ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దీంతో సదరు డ్రైవర్.. బ్రేక్ వేయకుండా.. ఇంజిన్ ఆఫ్ చేసి.. చాకచక్యంగా బస్సును స్లో చేశాడు.. అనంతరం ప్రయాణికులందరినీ కిందకు దింపి.. ఆ పామును ఓ కర్ర సాయంతో బయటికి తీశాడు. ఊహించని ఘటనకు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: కీడు సోకిందంటూ చెట్ల కింద ఉంటున్న గ్రామస్తులు | పది అడుగుల పాము బుసలు కొడితే..

Digital News Round Up: రెమ్యూనిరేషన్‌లో తగ్గేదే లే! | మాజీ సీఎం పరుగులెట్టించిన ఏనుగు ..లైవ్ వీడియో

TOP 9 ET News: హీరో చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డ్‌ | నివేదా లుక్‌ పై ట్రోల్స్

 

Published on: Sep 15, 2022 08:42 PM