Viral Video: 84 ఏళ్ల బామ్మకు వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన రెస్టారెంట్‌.. మనసులను కదిలిస్తోన్న వైరల్ వీడియో

పుట్టిన రోజంటే ఎవ‌రికైనా ప్రత్యేకమే. ఈ స్పెషల్‌ డేను ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. కేక్‌ కటింగ్‌, విందులు, వినోదాలు.. ఇలా పార్టీమూడ్‌లోకి వెళ్లిపోవాలనుకుంటారు.

Viral Video: 84 ఏళ్ల బామ్మకు వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన రెస్టారెంట్‌.. మనసులను కదిలిస్తోన్న వైరల్ వీడియో
84 Yr Old Woman
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2022 | 8:24 PM

పుట్టిన రోజంటే ఎవ‌రికైనా ప్రత్యేకమే. ఈ స్పెషల్‌ డేను ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. కేక్‌ కటింగ్‌, విందులు, వినోదాలు.. ఇలా పార్టీమూడ్‌లోకి వెళ్లిపోవాలనుకుంటారు. అయితే ఇవన్నీ నేటి జనరేషన్‌కు సరిపోతాయి. మన అమ్మానాన్నలు, అమ్మలు, తాతయ్యలు బర్త్‌డేలు, పుట్టిన రోజు పార్టీలంటూ ఏవీ చేసుకోరు. అయితే మన బర్త్‌డేను మనం మర్చిపోయానా ఇతరులు గుర్తు చేసి సెలబ్రేట్‌ చేస్తే ఆ ఆనందానికి ఆకాశమే హద్దు. ఈనేపథ్యంలో 84 ఏళ్ల మహిళ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసింది రెస్టారెంట్‌ యాజమాన్యం. ఈ సర్‌ప్రైజింగ్‌ షాక్‌కు సదరు వృద్ధురాలు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తీవ్ర భావోద్వేగానికి లోనైంది. గుడ్‌న్యూస్ డాగ్ అనే ట్విట్టర్‌ ఐడీతో ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వైరల్‌ వీడియోలో 84 ఏళ్ల రోజీ త‌నకు ఇష్టమైన రెస్టారెంట్‌లో ఫేవరెట్‌ ఫుడ్‌ను తింటూ ఆస్వాదిస్తుండగా.. రెస్టారెంట్‌ యాజమాన్యం ఆమెకు పెద్దగా పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిని చూసి ఆ వృద్ధురాలు ఎమోషనల్‌ కావడం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ‘హ్యాపీ బ‌ర్త్‌డే రోజీ’ అనే క్యాప్షన్‌ తో షేర్‌ అవుతోన్న ఈ వీడియోకు ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. అలాగే 18 లక్షలకు పైగా లైకులు రావడం విశేషం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Good News Dog (@goodnewsdog)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..