Robin Uthappa: పదేళ్లకే మూర్చ వ్యాధి.. స్టెరాయిడ్స్‌తో అధిక బరువు.. ఊతప్ప ఇన్‌స్పిరేషన్‌ జర్నీ ఇదే

Robin Uthappa Retirement: టీమిండియా క్రికెటర్‌ రాబిన్ ఉతప్ప రిటైరయ్యాడు. బుధవారం సోషల్ మీడియా వేదికగా తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. ఉతప్ప టీమ్ ఇండియా తరఫున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక టీమ్ ఇండియాకు తొలి టీ20 ప్రపంచకప్ విజయాన్ని అందించిన హీరోల్లో ఉతప్ప కూడా ఒకడు.

Robin Uthappa: పదేళ్లకే మూర్చ వ్యాధి.. స్టెరాయిడ్స్‌తో అధిక బరువు.. ఊతప్ప ఇన్‌స్పిరేషన్‌ జర్నీ ఇదే
Robin Uthappa
Follow us
Basha Shek

|

Updated on: Sep 14, 2022 | 8:38 PM

Robin Uthappa Retirement: టీమిండియా క్రికెటర్‌ రాబిన్ ఉతప్ప రిటైరయ్యాడు. బుధవారం సోషల్ మీడియా వేదికగా తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. ఉతప్ప టీమ్ ఇండియా తరఫున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక టీమ్ ఇండియాకు తొలి టీ20 ప్రపంచకప్ విజయాన్ని అందించిన హీరోల్లో ఉతప్ప కూడా ఒకడు. అందుకు ముందు కర్ణాటక, కేరళ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అందులో 9000కు పైగా పరుగులు చేశాడు. టీమిండియా తరఫున అలాగే ఐపీఎల్‌లోనూ పరుగులు వర్షం కురిపించాడు. ఎలాంటి బౌలర్లనైనా లెక్కచేయకుండా క్రీజు మధ్యలోకొచ్చి సులభంగా సిక్స్‌లు బాదడం ఈ కర్ణాటక క్రికెటర్‌ స్పెషాలిటీ. మరి క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ హార్డ్‌హిట్టర్‌ జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa)

  • రాబిన్ ఉతప్ప తండ్రి పేరు వేణు ఉతప్ప. అతను అంతర్జాతీయ హాకీ రిఫరీగా పనిచేశారు. అలాగే కర్ణాటక హాకీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రికి హాకీ అంటే ఇష్టం ఉన్నా, ఉతప్ప క్రికెట్‌ను ఇష్టపడ్డాడు. కాలక్రమేణా అదే తన కెరీర్‌గా మల్చుకున్నాడు.
  • రాబిన్ ఉతప్ప తండ్రి హిందువు కాగా తల్లి క్రిస్టియన్. ఉతప్ప 25 ఏళ్ల వరకు హిందువుగానే ఉన్నప్పటికీ 2011లో క్రైస్తవ మతంలోకి మారాడు. ఉతప్పతో పాటు అతని సోదరి కూడా క్రైస్తవ మతంలోకి మారారు.
  • ఉతప్ప పదేళ్ల వయసులో మూర్ఛ వ్యాధితో ఇబ్బంది బడ్డాడు. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్, మందులు తీసుకోవడంతో భారీగా బరువు పెరిగాడు. 20-25 ఏళ్ల వయసు వరకు కూడా అతనిని ఈ సమస్యలు వెంటాడాయి. అయితే పోషకాహార నిపుణుల సలహాతో 20 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా తయారయ్యాడు.
  • తన క్రికెట్‌ కెరీర్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఉతప్ప తన వ్యక్తిగత బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు ప్రవీణ్ ఆమ్రేని నియమించుకున్నాడు. ఉతప్ప ఎక్కడ ఆడినా ప్రవీణ్ ఆమ్రే అతనితో కలిసి ప్రయాణించేవాడు.
  • 2013-14 సంవత్సరాన్ని ఉతప్ప కెరీర్‌లో గోల్డెన్ ఇయర్‌గా పరిగణిస్తారు. ఈ ఏడాది కర్ణాటక రంజీ ట్రోఫీని గెలవడంతో అతను కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇరానీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. అలాగే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపాడు.
  • ఉతప్ప తన ఐపీఎల్‌ కెరీర్‌లో 205 మ్యాచ్‌ల్లో 27 హాఫ్‌ సెంచరీల సాయంతో 130.3 స్ట్రయిక్‌ రేట్‌తో 4952 పరుగులు చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన ఉతప్ప.. చాలా సందర్భాల్లో వికెట్‌కీపర్‌గానూ సేవలందించాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..