AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnam Raju: వందల ఎకరాలు.. లగ్జరీ బంగ్లాలు.. వ్యాపార సముదాయాలు.. రెబల్‌ స్టార్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయంటే?

Krishnam Raju Assets: హీరోగా, విలన్‌గా, సహ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ వేత్తగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటుకున్న రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన సోమవారం కన్నుమూశారు.

Krishnam Raju: వందల ఎకరాలు.. లగ్జరీ బంగ్లాలు.. వ్యాపార సముదాయాలు.. రెబల్‌ స్టార్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయంటే?
Hero Krishnam Raju
Basha Shek
|

Updated on: Sep 13, 2022 | 8:58 PM

Share

Krishnam Raju Assets: హీరోగా, విలన్‌గా, సహ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ వేత్తగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటుకున్న రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన సోమవారం కన్నుమూశారు. రెబల్‌ స్టార్‌ మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అశేష అభిమానుల ఆశ్రునయనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. కాగా సంపన్న కుటుంబంలోనే జన్మించినప్పటికీ సినిమా అవకాశాల కోసం తెగ ఇబ్బందులు పడ్డారు కృష్ణంరాజు. కొన్ని సందర్భాల్లో పస్తులు కూడా ఉన్నారని ఆయన సన్నిహితులు, స్నేహితులు చెబుతారు. కాగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడక ముందే కృష్ణంరాజుకు వారసత్వంగా బాగానే ఆస్తులు కలిసొచ్చాయట. ఆపై సినిమా రంగంలో కూడా బాగానే ఆస్తులు కూడబెట్టారట. ఈనేపథ్యంలో రెబల్‌స్టార్‌ మరణానంతరం ఆయన ఆస్తుల వివరాలు చర్చనీయాంశమయ్యాయి.

కాగా కృష్ణంరాజుకు తన తండ్రి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి ఉందట. ఇప్పటికీ ఆ భూముల వ్యవసాయ నిర్వహణ మొత్తం మొగల్తూరులోని కృష్ణంరాజు సమీప బంధువులు చూసుకుంటున్నారు. ఇక మొగల్తూరులోనే కృష్ణంరాజు పేరిట ఒక రాజభవనం కూడా ఉందట. ఇక జూబ్లిహిల్స్‌లో ఆయన నివాసముంటున్న బిల్డింగ్ ఖరీదు సుమారు రూ.18 కోట్ల వరకు ఉంటుందట. ఇదిలా ఉంటే సినిమా కెరీర్‌ ప్రారంభంలో చెన్నైలో ఉండేందుకు ఓ ఇల్లుతో పాటు పలు ఆస్తులు కొనుగోలు చేశారని సమాచారం. ఇక రెబల్‌ స్టార్‌ గ్యారేజీలో రూ. 90 లక్షల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్‌ కారుతో పాటు రూ.40 లక్షల విలువైన టయోటా ఫార్చునర్, రూ. 90 లక్షల ఖరీదైన వోల్వో ఎక్స్ సీ కార్లు కూడా ఉన్నాయట. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణంరాజు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. తన కుటుంబానికి రూ. 8.62 కోట్ల ఆస్తులు ఉన్నాయట. అలాగే రూ. 2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు అందులో చూపించారు. అదేవిధంగా 4 కిలోల బంగారం కూడా ఉండేదట. ఇవి కాకుండా హైదరాబాదులో ఆయనకు పలు వ్యాపార సముదాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కలిపి కృష్ణంరాజు ఆస్తుల విలువ సుమారు రూ. 200 నుంచి 300 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..