T20 World Cup: 15 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో చోటు.. ఎమోషనల్‌ అయిన టీమిండియా ఫినిషర్‌.. కల సాకారమైందంటూ..

Dinesh Karthik: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం మొత్తం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది.

T20 World Cup: 15 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో చోటు.. ఎమోషనల్‌ అయిన టీమిండియా ఫినిషర్‌.. కల సాకారమైందంటూ..
Indian Cricket Team
Follow us
Basha Shek

|

Updated on: Sep 12, 2022 | 10:06 PM

Dinesh Karthik: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం మొత్తం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది.ఈ జట్టులో వెటరన్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ వికెట్‌కీపర్‌ అండ్‌ ఫినిషర్‌ కోటాలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు. కాగా ఈ విషయం తెలియగానే ఎమోషనల్‌ అయ్యాడు డీకే. జట్టును ఎంపిక చేసిన కొద్ది నిమిషాలకే ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ‘కలలు నెరవేరాయి’ అంటూ టీ20 వరల్డ్‌కప్‌ ఆడాలన్న తన కల సాకార మైందని ట్వీట్‌ పెట్టాడు. దీనికి స్పందించిన హార్దిక్‌ ఛాంపియన్‌ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ వైరలవుతున్నాయి.

కాగా 2007లో జరిగిన మొదటి టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు డీకే. అయితే ఆ తర్వాత ధోని నీడలో పెద్దగా రాణించలేకపోయాడు. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు వెంటాడాయి. ఒకానొక దశలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. అయితే ఎప్పుడైతే దీపిక డీకే జీవితంలోకి అడుగుపెట్టిందో మళ్లీ జీవితంపై ఆశలు చిగురించాయి. క్రికెట్‌పై మళ్లీ ధ్యాస పెంచాడు. ఐపీఎల్‌లో ఫినిషర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ప్రతిభతోనే 37 ఏళ్ల వయసులో జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈక్రమంలోనే టీ20 ప్రపంకచకప్‌ జట్టులోకి ఎంపికైనందుకు ఎమోషనల్‌ అయ్యాడు దినేశ్‌ కార్తీక్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది