AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bipasha Basu: కన్నుల పండువగా హీరోయిన్‌ సీమంతం.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న ఫొటోస్‌

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాషా బసు (Bipasha Basu) త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తూ ఆ ఫొటోలను నిత్యం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతుందీ ముద్దుగుమ్మ.

Bipasha Basu: కన్నుల పండువగా హీరోయిన్‌ సీమంతం.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న ఫొటోస్‌
Bipasha Basu
Basha Shek
|

Updated on: Sep 11, 2022 | 10:55 AM

Share

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాషా బసు (Bipasha Basu) త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తూ ఆ ఫొటోలను నిత్యం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతుందీ ముద్దుగుమ్మ. ఇటీవల భర్త కరన్‌ సింగ్ గ్రోవర్‌ (Karan Singh Grover) తో ఆమె తీసుకున్న మెటర్నిటీ ఫొటోషూట్‌ నెట్టింట్లో తెగ వైరలైంది. తాజాగా బిపాసా సీమంతం వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రెడ్ కలర్‌ ట్రెడిషనల్‌ శారీలో ఎంతో అందంగా ముస్తాబైంది బిపాసా. తన భర్తతో కలిసి రొమాంటిక్ పోజుల్లో ఫొటోలు దిగింది. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ బిపాసా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Bipasha Basu (@bipashabasu)

కాగా జిస్మ్‌, ధూమ్‌ సిరీస్‌ సినిమాల్లో అందాలు ఆరబోసి కుర్రకారు హృదయాల్లో కలకలం రేపింది బిపాసాబసు. హిందీలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేశ్‌ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో సందడి చేసిందీ బెంగాలీ బ్యూటీ. కాగా ఈ అందాల తార చివరిసారిగా 2015లో ఎలోన్‌ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన కరణ్‌సింగ్ గ్రోవర్‌తో ప్రేమలో పడిందామె. కొన్ని నెలల పాటు డేటింగ్‌ చేసిన ఈ జోడీ 2016లో పెద్దల అనుమతితో కలిసి పెళ్లిపీటలెక్కారు. వారి ఆరేళ్ల ప్రేమానుబంధానికి ప్రతీకగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు లవ్లీ కపుల్‌.

View this post on Instagram

A post shared by Bipasha Basu (@bipashabasu)

View this post on Instagram

A post shared by Bipasha Basu (@bipashabasu)

View this post on Instagram

A post shared by Bipasha Basu (@bipashabasu)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్