AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వాట్‌ ఎన్‌ ఐడియా సర్‌ జీ.. బద్ధకాన్ని వదిలించే అలారం బెడ్‌.. మాక్కూడా కావాలంటోన్న నెటిజన్లు

Alarm Bed: మనకున్న బద్ధ శత్రువుల్లో బద్ధకం కూడా ఒకటి. పొద్దున్నే నిద్ర లేవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా ఏదో ఒకటి వాయిదా వేయడం, తీరా సమయం వచ్చాక హడావిడి పడిపోవడం మనలో చాలామందికి అలవాటు.

Viral Video: వాట్‌ ఎన్‌ ఐడియా సర్‌ జీ.. బద్ధకాన్ని వదిలించే అలారం బెడ్‌.. మాక్కూడా కావాలంటోన్న నెటిజన్లు
Alarm Bed
Basha Shek
|

Updated on: Sep 10, 2022 | 9:55 AM

Share

Alarm Bed: మనకున్న బద్ధ శత్రువుల్లో బద్ధకం కూడా ఒకటి. పొద్దున్నే నిద్ర లేవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా ఏదో ఒకటి వాయిదా వేయడం, తీరా సమయం వచ్చాక హడావిడి పడిపోవడం మనలో చాలామందికి అలవాటు. ఉద్యోగస్తులైతే ఉదయాన్నే లేచేందుకు బద్ధకిస్తారు. ఇది ఆరోజు పనులన్నింటిపై పరోక్ష ప్రభావం చూపుతంది. ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లడం.. పని తీరు తగ్గిపోవడం.. ఇలా బద్ధకం మన జీవితంపై అన్ని రకాలుగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక విద్యార్థులు, యువకులైతే ఉదయాన్నే లేవాలన్నా, చదవాలన్నా తెగ అలక్ష్యం వహిస్తుంటారు. అన్ని పనులు వాయిదా వేస్తూ తీరిగ్గా పరీక్షలు దగ్గర వచ్చేసరికి తెగ కంగారు పడిపోతుంటారు. అయితే బద్ధకాన్ని వదిలించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా పట్టుదలే. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో అలారం బెడ్ (Alarm bed) కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఉదయాన్నే లేచేందుకు బద్ధకించే వారికి.. ఈ బెడ్ సరిగ్గా సరిపోతుంది. మనలోని నిద్రమత్తును వదిలించేవరకు మనల్ని కుదుపులకు గురిచేసే ఈ బెడ్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలో ఉదయం అవుతున్నా ఒక బాలుడు బెడ్‌పై పడుకుని ఉంటాడు. అయితే అతడిని నిద్రలేపేందుకు తల్లిదండ్రులు ఒక చక్కని ఐడియా వేశారు. పిల్లాడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏకంగా అలారం బెడ్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఫిక్స్ చేసిన సమయం రాగానే ఒక్కసారిగా బెడ్ కుదుపులకు గురువుతంది. బాలుడిని పైకి కిందకు ఎత్తి పడేస్తుంది. దెబ్బకు ఆ బాలుడు ఉలిక్కిపడి లేస్తాడు. మళ్లీ పడుకోవాలని ట్రై చేసినా సాధ్యం కాదు. చివరకు చేసేదేమి లేక బెడ్ కిందకు దిగి అలారం ఆపేస్తాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ఇది బద్ధకస్తులకు బ్రహ్మాండమైన బెడ్, సూపర్‌ బెడ్‌’ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే.. ‘అర్జెంట్‌గా ఈ బెడ్‌ కావాలి. ఎక్కడ దొరుకుతుంది’ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అలారం బెడ్ వైరల్ వీడియో :

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!