Viral Video: వామ్మో.. సలసలా కాగుతున్న నూనెలో చేతులు ముంచి వడపావ్ తయారీ.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మనలో చాలామంది రోడ్ సైడ్ ఫుడ్స్‌ను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఇప్పుపడు పట్టణాలు, నగరాలతో పాటు గ్రామాల్లోనూ ఈ ఫుడ్‌స్టాల్స్ వెలస్తున్నాయి. సాయంత్రమైతే చాలు ఈ దుకాణాలు కిటకిటలాడుతుంటాయి.
మనలో చాలామంది రోడ్ సైడ్ ఫుడ్స్‌ను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఇప్పుపడు పట్టణాలు, నగరాలతో పాటు గ్రామాల్లోనూ ఈ ఫుడ్‌స్టాల్స్ వెలస్తున్నాయి. సాయంత్రమైతే చాలు ఈ దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. అయితే రుచికరమైన వంటలను ఎంతో వేగంగా చేయడం ఒక కళ. హాట్ పాన్ ముందు నిల్చొని, ఎదురుగా ఉన్న కస్టమర్లతో వ్యవహరించడం, రుచిలో తేడా లేకుండా ఆహారాన్ని సిద్ధం చేయడం కష్టంతో కూడుకున్న సవాలే. ఈ నేపథ్యంలో నాసిక్‌కు చెందిన ఒక మహిళ సలసలా కాగుతున్న నూనెలో నుంచి చేతులతో వడపావ్‌ను బయటకు తీస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆమె మొదట పావ్‌లోకి చీజ్ ముక్కలు, ఆలమ్ మసాలా ఉంచి ఆ తర్వాత శెనగపిండిలో ముంచి వేడి నూనెలో వేస్తుంది. బాగా వేగిన తర్వాత, కాగుతున్న నూనెలో తన చేతిని ముంచి, చీజ్ వడ పావ్ తీసి ప్లేట్‌లో వడిస్తోంది. veggie bite అనే పేరుగల ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో షేర్ చేయగా అది కాస్తా వైరలైంది. ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అలాగే లక్షలమంది లైకులు కొట్టారు. వేలాదిమంది నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఎందుకు అంత తొందర? చెంచా, గరిటే కాకుండా వేడి నూనెలో చేయి ముంచడం ఏమిటి?’, ‘మేడమ్, గ్లోవ్స్ వేసుకోండి. పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం’ అంటూ నెటిజన్లు మహిళకు సూచిస్తున్నారు. అయితే మరికొంతమంది దీని వెనక ఒక చిట్కా ఉందంటున్నారు. అదేంటంటే.. నిజానికి ఒక చుక్క నూనె శరీరంపై పడితే బొబ్బలు వస్తాయి. అయితే చేతులకు చల్లని నూనె, నిమ్మరసం అప్లై చేసి కాగుతున్న నూనెలో ముంచినా మంటగా అనిపించదట. ఎందుకంటే నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ కాగుతున్న నూనెలోని వేడిని పీల్చుకుంటుంది. ఫలితంగా చేతులకు ఎలాంటి మంట, నొప్పి కలగదట. అయితే మీరు మాత్రం ఇలాంటివి ప్రయత్నించకండి. కచ్చితంగా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..