Betel leaf: భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

Betel leaf Benefits: భారతీయ మతపరమైన ఆచారాలలో తమలపాకుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాగే దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.

Betel leaf: భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
Betel Leaf
Follow us

|

Updated on: Sep 07, 2022 | 11:32 AM

Betel leaf Benefits: సాధారణంగా భోజనం చేసిన తర్వాత చాలామంది తమలపాకు తినడం లేదా పాన్ బీడా వేసుకుంటారు. ఇది మంచి అలవాటు కూడా. ముఖ్యంగా పండుగలు, వేడుకల సమయంలో తమలపాకులను దేవతలకు, కుటుంబ పెద్దలకు కూడా సమర్పిస్తుంటారు. భారతీయ మతపరమైన ఆచారాలలో తమలపాకుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాగే దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. హిందీలో పాన్ కా పఠా అని, తెలుగులో తమలపాకు, తమిళంలో వెతలపాకు, మలయాళంలో వట్ల అని పిలవబడే తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ వంటి విటమిన్లతో పాటు క్యాల్షియం వంటి మూలకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

తమలపాకులతో ఆరోగ్య ప్రయోజనాలివే..

  • శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు, ప్రేగులలో pH స్థాయులను క్రమబద్ధీకరిస్తాయి.
  • తమలపాకు ఒక అద్భుతమైన నొప్పి నివారిణి. ఇది వంటి నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం ఇస్తుంది.
  • తమలపాకులు యాంటీ ఆక్సిడెంట్లకు పవర్‌హౌస్ లాంటివి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సమర్థంగా పనిచేస్తాయి. అలాగే శరీరంలో సాధారణ PH స్థాయులను పునరుద్ధరిస్తాయి. ఫలితంగా ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
  • తమలపాకులు తింటే మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి. అలాగే జీవక్రియను పెంచుతాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
  • దగ్గు, జలుబు సంబంధిత సమస్యలకు సంబంధించిన చికిత్సలో తమలపాకులను విరివిగా ఉపయోగిస్తారు.
  • ఛాతీ, ఊపిరితిత్తులు, ఆస్తమాతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధం. తమలాపాకులపై కొద్దిగా ఆవాల నూనెను రాసి, వేడి చేసి ఛాతీపై ఉంచితే గుండె నొప్పి సమస్యల బారి నుంచి బయటపడవచ్చు.
  • తమలపాకుల్లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి అద్భుతమైన క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా చావికోల్ జెర్మ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
  • తమలపాకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి టైప్ 2 డయాబెటిక్ రోగులు కూడా దీనిని తీసుకోవచ్చు.
  • తమలపాకు ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్‌ను అదుపు చేయకపోవడం వల్ల కలిగే మంటను నివారిస్తుంది.
  • తమలపాకులో సుగంధ ఫినోలిక్ సమ్మేళనాలు ఉండటం వల్ల కాటెకోలమైన్‌ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. కాబట్టి తమలపాకును నమలడం అనేది డిప్రెషన్‌ను అధిగమించడానికి సులువైన మార్గమని చెప్పుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి