Bigg Boss Telugu 6: తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్న స్టార్‌ సింగర్‌.. తన భార్యను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్‌

Singer Revanth: మనోహరి.. అంటూ బాహుబలి సినిమాలోని పాటతో స్టార్‌ సింగర్‌గా మారిపోయాడు రేవంత్‌. అంతకుముందు 2017లో ఇండియన్‌ ఐడల్‌-9లో పాల్గొని టైటిల్‌ విన్నర్‌గా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు.

Bigg Boss Telugu 6: తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్న స్టార్‌ సింగర్‌.. తన భార్యను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్‌
Singer Revanth
Follow us
Basha Shek

|

Updated on: Sep 06, 2022 | 11:29 AM

Singer Revanth: మనోహరి.. అంటూ బాహుబలి సినిమాలోని పాటతో స్టార్‌ సింగర్‌గా మారిపోయాడు రేవంత్‌. అంతకుముందు 2017లో ఇండియన్‌ ఐడల్‌-9లో పాల్గొని టైటిల్‌ విన్నర్‌గా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు. 200కు పైగా సినిమాల్లో పాటలు పాడిన రేవంత్‌ తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌6లోకి అడుగుపెట్టాడు. కాగా హౌస్‌లోకి వెళ్లేముందు ఓ ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసుకున్న ఈ స్టార్‌ సింగర్‌.. అందులో తన సతీమణిని మిస్‌ అవుతున్నట్లు రాసుకొచ్చాడు. కొన్ని నెలల క్రితం అన్విత అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు రేవంత్‌. ప్రస్తుతం అతని భార్య ఆరునెలల గర్భంతో ఉంది. ఈనేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన రేవంత్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ‘నా భార్య ఇప్పుడు గర్భంతో ఉంది. ఇలాంటి సమయంలో తన పక్కన లేకుండా ఇక్కడకు రావడం కొంచెం బాధగా ఉంది’ అంటూ స్టేజిపైనే భావోద్వేగానికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Singer Revanth ? (@singerrevanth)

కాగా ఇదే సమయంలో అన్విత కూడా షోలో కనిపించి భర్తకు బెస్ట్‌ విషెస్‌ చెప్పింది. ఇదిలా ఉంటే త్వరలోనే అమ్మనాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్న రేవంత్‌ దంపతులకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతా మంచే జరగాలంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. రేవంత్‌ గతంలోనూ పలు టీవీ షోల్లోనూ పాల్గొన్నాడు. పాటలు పాడడంతో పాటు ఫన్‌ అందించడంలోనూ సక్సెస్‌ అయ్యాడు. మరి బిగ్‌బాస్‌షోలో అతను ఏ మేర వినోదం అందిస్తాడో లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!