AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది విషెస్.. ఏమన్నారంటే..?

ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలుగులో ట్వీట్ చేశారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అటు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఉగాది విషెస్ తెలిపారు. ఏమన్నారో చూద్దాం.

PM Modi: తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది విషెస్.. ఏమన్నారంటే..?
Modi
Venkatrao Lella
|

Updated on: Mar 19, 2026 | 9:03 AM

Share

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభ్రప్రదమైన ఉగాది పండుగ సందర్బంగా ప్రతీఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. “సంప్రదాయాలతో ముడిపడి ఉండటంతో పాటు కొత్త శక్తికి, ఆరంభాలకు ఉగాది పండుగ ప్రతీక. నూతన సంవత్సరానికి ఉగాది నాంది పలుకుతుంది. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాను. తమ ఆకాంక్షలను చిత్తశుద్దితో కొనసాగించేలా, సమాజశ్రేయస్సుకు సానుకూలతతో దోహరదపడేలా ఈ ఏడాది ప్రతీఒక్కరినీ ప్రేరేపించాలని కోరుకుంటున్నాను” అంటూ మోదీ పేర్కొన్నారు.

చంద్రబాబు ఉగాది విషెస్

తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. “షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి” అంటూ చంద్రబాబు తెలిపారు.

రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు

అటు తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు.

Follow Us