Viral Video: బుసలు కొడతూ దూసుకొచ్చిన కింగ్‌కోబ్రా.. పిల్లలను కాపాడుకునేందుకు కోడి తాపత్రయం చూస్తే..

King Cobra vs Hen: ఆపదలో ఉన్న పిల్లలను కాపాడుకోవడానికి తల్లి ఎంతటి త్యాగానికైనా ఒడిగడుతుంది. అవసరమైతే ప్రాణాలను కూడా బలిపెడుతోంది. మనుషులతో పాటు మూగజీవాలకూ ఇది వర్తిస్తుంది.

Viral Video: బుసలు కొడతూ దూసుకొచ్చిన కింగ్‌కోబ్రా.. పిల్లలను కాపాడుకునేందుకు కోడి తాపత్రయం చూస్తే..
King Cobra Vs Hen
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2022 | 1:13 PM

King Cobra vs Hen: ఆపదలో ఉన్న పిల్లలను కాపాడుకోవడానికి తల్లి ఎంతటి త్యాగానికైనా ఒడిగడుతుంది. అవసరమైతే ప్రాణాలను కూడా బలిపెడుతోంది. మనుషులతో పాటు మూగజీవాలకూ ఇది వర్తిస్తుంది. కాగా ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సర్ప జాతుల్లో కింగ్ కోబ్రా ముందుంటుంది. ఇది కాటు వేసిందంటే చాలా సందర్భాల్లో ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి విషసర్పాలు దక్షిణాసియా దేశాలు, ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈనేపథ్యంలో ఇలాంటి ప్రమాదకరమైన పాము నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి కోడి అలుపెరగని పోరాటం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోని చూస్తే.. ఒక తల్లి కోడి తన పిల్లలతో కలిసి ఒక గది మూలన ఉంటుంది. ఇంతలో ఆ చిన్న గదిలోకి భయంకర విషసర్పం కింగ్ కోబ్రా చొరబడింది. మెల్లగా పాకుతూ ఆ కోడిపిల్లల వద్దకు చేరింది. అది తన పిల్లలను తినేందుకే వస్తోందని గ్రహించిన తల్లి కింగ్‌కోబ్రాతో పెద్ద యుద్ధమే చేసింది. కోబ్రా ఎగిరెగిరి బుసలు కొడుతున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఎదురుతిరిగింది. తన పిల్లల్లో ఒక్కటి కూడా పాము బారిన పడకుండా రక్షించుకుంది. ఒకవైపు పాముపై దాడి చేస్తూనే ఒక్కొక్క కోడి పిల్లను అక్కడి నుంచి బయటకు తప్పించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ల మంది ఈ వీడియోను చూడగా లక్షలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. మనుషులైనా, మూగజీవులైనా అమ్మ ప్రేమకు ఏది సాటి రాదని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..