Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అయ్యయ్యో మరీ ఇంత చీటింగా.. ఆకలితో చికెన్ వింగ్స్‌ ఆర్డర్ చేసిన కస్టమర్‌.. పార్శిల్‌లో వచ్చింది చూసి షాక్‌

Online Food Order: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన వారికి ఇటీవల వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలకు బదులు పార్శిల్‌లో ఏవేవో వస్తున్నాయి. వీటిపై సంబంధిత రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు.

Viral: అయ్యయ్యో మరీ ఇంత చీటింగా.. ఆకలితో చికెన్ వింగ్స్‌ ఆర్డర్ చేసిన కస్టమర్‌.. పార్శిల్‌లో వచ్చింది చూసి షాక్‌
Chewed Chicken Bones
Follow us
Basha Shek

|

Updated on: Sep 04, 2022 | 4:28 PM

Online Food Order: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన వారికి ఇటీవల వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలకు బదులు పార్శిల్‌లో ఏవేవో వస్తున్నాయి. వీటిపై సంబంధిత రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు. తాజాగా ఇలాంటి అనుభవమే మరొకరికి ఎదురైంది. బాగా ఆకలితో ఉన్న ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో చికెన్ వింగ్స్‌ఆర్డర్ చేశాడు. అనుకున్నట్లు గానే ఫుడ్‌ పార్శిల్‌ వచ్చింది. కానీ ప్యాక్ విప్పి చూస్తే అందులో చికెన్ వింగ్స్ లేవు. ఎవరో బాగా నమిలిపెట్టిన చికెన్ బోన్స్ ఉన్నాయి. దీంతో ఆ కస్టమర్‌ కళ్లు తేలేశాడు. దీనికి తోడు అందులో ఒక లెటర్‌ కూడా కనిపించింది. అందులో క్షమాపణలు కోరుతున్నట్లు రాసి ఉంది. ఇంతకీ అందులో చికెన్‌ వింగ్స్‌ ఏమయ్యాయి? ఆ లెటర్‌ ఎవరు రాశారంటే?

ఫుడ్‌ పార్శిల్‌లోని చికెన్‌ వింగ్స్‌ను డెలివరీ బాయే తినేశాడు. అలా చేసినందుకు క్షమాపణలు కూడా చెబుతూ ఓ లేఖ రాసి చెప్పిన అడ్రస్‌కే పార్శిల్‌ పంపించాడు. ‘ నేను చాలా ఆకలితో ఉన్నాను. అందుకే మీకు డెలివరీ చేయాల్సిన చికెన్‌ వింగ్స్‌ను నేనే తిన్నాను. దయచేసి ఏమి అనుకోకండి. ఈసారికి నా తిండి కోసం మీరు డబ్బులు చెల్లించారని అనుకోండి. ఇక నేను ఈ ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నాను. ఇట్లు డెలివరీ బాయ్’ అని ఆ లెటర్‌లో తెలిపాడు. దీంతో ఆ కస్టమర్‌ పార్శిల్‌లో ఉన్న బోన్స్‌ని, లెటర్‌ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఫ్రైడ్ చికెన్ వింగ్స్ ఆర్డర్ చేస్తే బోన్స్ డెలివరీ చేయడం దారుణమని వాపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలంటూ నెటిజన్లను సలహాలు కోరాడు. చాలామంది ఫన్నీ కామెంట్స్‌తో సమాధానమిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..