Watch Video: నా బౌలింగ్‌లో ఫోర్ కొడతావా.. మైదానంలో హార్దిక్ సహచరుడి బీభత్సం.. నెట్టింట వైరల్ వీడియో
శ్రీలంకపై రషీద్ ఖాన్ 39 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఆసియాకప్ లో అతని బౌలింగ్‌లో ఇది రెండో చెత్త ఫిగర్ గా నమోదైంది.
మైదానంలో రషీద్ ఖాన్ కోపాన్ని ఎప్పుడూ చూడలేదు. అయితే, ఆసియా కప్‌లో మాత్రం కట్టలు తెంచుకున్న కోపోద్రిక్తుడైన రషీద్ ను చూడొచ్చు. షార్జా వేడిలో, రషీద్ ఖాన్ కూడా చాలా వేడిగా కనిపించినట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ దృశ్యం అంతా గ్రౌండ్‌లో అమర్చిన కెమెరాలో రికార్డైంది. దీంతో ఇది వైరల్‌గా మారింది. శ్రీలంక ఇన్నింగ్స్ 17వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రషీద్ ఖాన్ వర్సెస్ దనుష్క గొడవ..
రషీద్ ఖాన్ ఆవేశానికి లోనైన 17వ ఓవర్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో స్ట్రైక్‌లో ఉన్న శ్రీలంక బ్యాట్స్‌మెన్ దనుష్క గుణతిలక అద్భుతమైన ఫోర్ కొట్టాడు. రివర్స్ స్వీప్ షాట్ ద్వారా నాలుగు పరుగులు రాబట్టాడు. ఈ షాట్ తర్వాత, రషీద్ ఖాన్ చాలా కోపంగా ఉన్నాడు. బ్యాటర్, బౌలర్ మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మరో ఎండ్ లో ఉన్న బ్యాటర్, అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
తొలుత వాగ్వాదం.. అనంతరం వికెట్లు..
రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో 39 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఆసియాకప్ లో అతని బౌలింగ్‌లో ఇది రెండో చెత్త ఫిగర్ గా నమోదైంది. అయితే అదే ఓవర్ నాలుగో బంతికి గుణతిలక బెయిల్స్‌ని చెదరగొట్టి అతనితో వాగ్వాదానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
— Bleh (@rishabh2209420) September 3, 2022
సూపర్ ఫోర్‌లో శ్రీలంక విజయం..
మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక జట్టు ఆఫ్ఘనిస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది . ఈ మ్యాచ్‌లో శ్రీలంక మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక 179 పరుగులు చేసింది. ఈ విజయంతో శ్రీలంక కూడా గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.