AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet care in summer: ఎండలు మండుతున్నాయ్.. ఈ టిప్స్‌తో మీ పెంపుడు జంతువులను కాపాడుకోండి

వేసవిలో పెంపుడు జంతువులకు నీరు అందించడం అనేది అత్యంత ప్రాథమిక అవసరం. కానీ, కేవలం నీరు ఇవ్వడమే కాకుండా, వాటి ఆహారం మరియు జీవనశైలిలో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా వాటిని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని తెలుసా

Pet care in summer: ఎండలు మండుతున్నాయ్.. ఈ టిప్స్‌తో మీ పెంపుడు జంతువులను కాపాడుకోండి
Pet Care In Summer.jpg
Nikhil
|

Updated on: Mar 18, 2026 | 7:15 AM

Share

భారతదేశంలో వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఎండలు మండిపోతుంటే మనుషులమే తట్టుకోలేక అల్లాడిపోతుంటాం. మరి మన ఇంట్లో ఉండే మూగజీవాల పరిస్థితి ఏంటి? కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు చెమట పట్టే గ్రంథులు తక్కువగా ఉండటం వల్ల అవి వేడిని త్వరగా తట్టుకోలేవు.

ఈ సీజన్‌లో అవి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే పెంపుడు జంతువుల సంరక్షణ విషయంలో యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గోఫీ టెయిల్స్ వ్యవస్థాపకులు, పెట్ ఎక్స్‌పర్ట్ కరణ్ గుప్తా పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన చిట్కాలు చూద్దాం.

  • స్వచ్ఛమైన నీరు – ఎండల వల్ల గిన్నెల్లోని నీరు త్వరగా వేడెక్కుతుంది. కాబట్టి రోజుకు మూడు నాలుగు సార్లు నీటిని మారుస్తూ ఉండాలి. ఇంటిలోని వివిధ మూలల్లో నీటి గిన్నెలను ఉంచడం వల్ల అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీటిని తాగే అవకాశం ఉంటుంది.
  • ఆహారంలో మార్పులు‌‌- డ్రై ఫుడ్ కంటే వేసవిలో వెట్ ఫుడ్ (తేమ ఎక్కువగా ఉండే ఆహారం) ఇవ్వడం మంచిది. భోజనంలో కొంచెం చికెన్ బ్రోత్ లేదా నీటిని కలపడం వల్ల అవి తింటూనే హైడ్రేటెడ్ గా ఉంటాయి. ఇది వాటి జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
  • పెట్-సేఫ్ పండ్లు, కూరగాయలు- మనుషుల లాగే జంతువులకు కూడా కొన్ని పండ్లు చలవ చేస్తాయి. గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు లేదా దోసకాయ ముక్కలను స్నాక్స్‌గా ఇవ్వవచ్చు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, హైడ్రేషన్ అందుతాయి.
  • నడక సమయాల్లో జాగ్రత్త- ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లకూడదు. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లోనే బయటకు తీసుకెళ్లాలి. ఆ సమయంలో కూడా వెంట ఒక వాటర్ బాటిల్, చిన్న గిన్నె ఉంచుకోవడం మంచిది. మధ్యమధ్యలో విరామం ఇస్తూ వాటికి నీటిని అందిస్తూ ఉండాలి.
  •  ప్రశాంతమైన విశ్రాంతి స్థలం- ఇంటి లోపల గాలి వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో లేదా కూలింగ్ మ్యాట్స్ ఉన్న చోట అవి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. మధ్యాహ్నం వేళల్లో ఎండ తగలకుండా నీడ ఉన్న చోట వాటిని ఉంచాలి. కావాలంటే చల్లటి బ్రోత్ లేదా ఫ్రోజెన్ ట్రీట్స్ ఇవ్వడం వల్ల అవి హాయిగా ఫీల్ అవుతాయి.
  • డీహైడ్రేషన్ లక్షణాలు- మీ పెంపుడు జంతువు అతిగా రొప్పుతున్నా, నీరసంగా ఉన్నా, చిగుళ్లు ఎండిపోయినా లేదా ఆహారం తీసుకోకపోయినా అది డీహైడ్రేషన్ లక్షణం కావచ్చు. వెంటనే పశువైద్యుడిని సంప్రదించడం లేదా వాటిని చల్లబరిచే ప్రయత్నం చేయడం ముఖ్యం.

మన ఇంట్లో ఒక సభ్యునిలా ఉండే పెంపుడు జంతువుల పట్ల ఈ వేసవిలో కొంచెం శ్రద్ధ చూపిస్తే, అవి ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కొంచెం నీడ, సరైన ఆహారం, తగినంత నీరు ఇవే వాటికి మనం ఇచ్చే గొప్ప బహుమతులు.

Follow Us