Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కావాల్సింది 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్.. కానీ ఇచ్చే శాలరీ చూస్తే నొరెళ్లబెట్టాల్సిందే.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని ఏళ్ల సినియారిటీ ఉన్నప్పుడు ఆ జీతం ఎలా ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నైపుణ్యాలు లేకుంటే ఆ జీతం ఓకే అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

Viral: కావాల్సింది 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్.. కానీ ఇచ్చే శాలరీ చూస్తే నొరెళ్లబెట్టాల్సిందే.. ఏకిపారేస్తున్న  నెటిజన్లు
Viral Job Offer
Follow us
Venkata Chari

|

Updated on: Aug 31, 2022 | 7:35 PM

మహమ్మారి తరువాత, చాలా మంది ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలో, అదృష్టవశాత్తూ ఉపాధి దొరికిన వారు చాలా గంటలు, తగినంత జీతంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఇటీవల ఒక ఉద్యోగ ప్రకటన నెట్టింట్లో వైరల్ అయ్యింది. అందులో పేర్కొన్న కారణం తెలిసి, నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చండీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూసి, జనాలు ఆశ్చర్యపోయారు. కంప్యూటర్ యానిమేషన్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వరకు నైపుణ్యాలు కలిగిన వీడియో ఎడిటర్ కావాలని ప్రకటనలో పేర్కొంది. అలాగే అభ్యర్థికి 2D, 3D, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో మొదలైన వాటిలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలని పేర్కొంది. ఉద్యోగ అవసరాలు సహేతుకంగా కనిపించినప్పటికీ, వాళ్లు ఆఫర్ చేసిన జీతం చూసి జనాలు అవాక్కవుతున్నారు. పూర్తి సమయం ఉద్యోగం కోసం కేవలం రూ.10,468లు ఇవ్వనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఉద్యోగ ప్రకటన స్క్రీన్‌షాట్‌ను అనురాగ్ మౌర్య అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. జీతం చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. అలాగే ఈ ఉద్యోగానికి కనీసం 4 నుంచి 5 ఏళ్ల వరకు ఎక్స్ పీరియన్స్ కావాలని పేర్కొన్నారు.

దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని ఏళ్ల సినియారిటీ ఉన్నప్పుడు ఆ జీతం ఎలా ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నైపుణ్యాలు లేకుంటే ఆ జీతం ఓకే అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు