ప్రస్తుతం చైనా స్పీడ్ క్యూబింగ్ సుప్రీమో లీ జిహావో ఈ ఘనత సాధించాడు. దీంతో పాటు అతి తక్కువ సమయంలో చేసిన వ్యక్తిగా కూడా నిలిచాడు. దీంతో అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌లో కూడా చేరింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్ విడుదల చేసిన వీడియోతో ఈ సమాచారం అందించారు.
3 నిమిషాల 30 సెకన్లలోపు పజిల్‌లను పరిష్కరించాడు..
చైనాలోని ఫుజియాన్ నగరంలోని జియామెన్ ప్రాంతంలో నివసిస్తున్న లి జిహావో 29 జులై 2022న 3 నిమిషాల 29.29 సెకన్లలో మూడు పజిల్ క్యూబ్‌లను పరిష్కరించాడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. ఐదేళ్ల క్రితం మూడు పజిల్ క్యూబ్స్‌తో చేసిన ఈ రికార్డులో ఎవరైనా మూడున్నర నిమిషాల వ్యవధిలో దాన్ని పరిష్కరించడం ఇదే తొలిసారి అని అందులో పేర్కొన్నారు.