IND vs HKG Playing XI: దినేష్ కార్తీక్ స్థానంలో ఆ ప్లేయర్‌కు చోటు.. హాంకాంగ్‌తో బరిలోకి దిగే భారత జట్టు ఇదే?
Venkata Chari |
Updated on: Aug 30, 2022 | 3:21 PM
ఈ మ్యాచ్‌లో విజయం కోసం టీమ్ ఇండియా బలమైన పోటీదారుగా బరిలోకి దిగనుంది. అయితే దాని ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు వస్తాయంటూ తెలుస్తోంది.
Aug 30, 2022 | 3:21 PM
ఆసియా కప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం టీమ్ ఇండియా బలమైన పోటీదారుగా బరిలోకి దిగనుంది. అయితే దాని ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు వస్తాయంటూ తెలుస్తోంది.
1 / 5
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేదు. అతని స్థానంలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా దినేష్ కార్తీక్ ఎంపికయ్యాడు. అదే సమయంలో అవేశ్ ఖాన్ మూడో ఫాస్ట్ బౌలర్‌గా కూడా చోటు దక్కించుకున్నాడు. హాంకాంగ్‌పై టీమ్ ఇండియా తన ప్లేయింగ్ XI, కాంబినేషన్‌ని మార్చగలదా? లేదా అనేది చూడాలి.
2 / 5
హాంకాంగ్‌తో ఎలాంటి మార్పులు లేకుండా టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందనే నమ్మకం ఉంది. రోహిత్ శర్మ బహుశా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రిషబ్ పంత్ మరోసారి బెంచ్‌పై కూర్చోవాల్సి రావచ్చు.
హాంకాంగ్‌పై గెలిచిన వెంటనే భారత జట్టు సూపర్ 4కి అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత బి గ్రూప్ నుంచి సూపర్ 4 రెండవ జట్టు పాకిస్తాన్-హాంకాంగ్ మధ్య మ్యాచ్ ద్వారా తెలనుంది. పాక్ గెలిస్తే ఆదివారం భారత్-పాక్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది.