IND vs PAK: టీ20Iల్లో అగ్రస్థానం హిట్‌మ్యాన్ సొంతం.. అన్ని జట్లపై దూకుడు.. కట్‌చేస్తే.. వారిపై మాత్రం ఘోర వైఫల్యం..
రోహిత్ మొత్తం T20 గణాంకాలు చూస్తే, ఇప్పటివరకు మొత్తం 133 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 32.10 సగటుతో 3499 పరుగులు చేయగలిగాడు.
రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఈ సమయంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. పరిమిత ఓవర్లలో రోహిత్ బ్యాటింగ్‌ను అందరూ మెచ్చుకుంటారు. కానీ, ఒక జట్టు ముందు, T20 లో రోహిత్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం..
- ఆ జట్టు పాకిస్థాన్. పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో రోహిత్ బ్యాట్ ప్రశాంతంగా ఉంది. అతను ఈ జట్టుపై ఎలాంటి విధ్వంసం చేయలేకపోయాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రోహిత్ బ్యాట్ నుంచి ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు కాలేదు.
- రోహిత్ పాకిస్థాన్‌తో ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఇందులో అతని గణాంకాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో రోహిత్ బ్యాట్ 12, 0, 10, 0, 24, 4, 2, 30 పరుగులు చేసింది.
- ఆసియా కప్-2022లో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు. అది కూడా భారత్ ప్రారంభంలోనే మొదటి వికెట్ కోల్పోయిన దశలో.. కానీ రోహిత్ అనవసరమైన షాట్ ఆడుతూ 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
- రోహిత్ మొత్తం T20 గణాంకాలు చూస్తే, ఇప్పటివరకు మొత్తం 133 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 32.10 సగటుతో 3499 పరుగులు చేయగలిగాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి