AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: గౌతమ్ గంభీర్‌పై పాక్ మాజీ సారథి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైరవుతోన్న నెటిజన్లు..

గౌతమ్ గంభీర్ గురించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో షాహిద్ అఫ్రిదిపై టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

IND vs PAK: గౌతమ్ గంభీర్‌పై పాక్ మాజీ సారథి వివాదాస్పద వ్యాఖ్యలు..  ఫైరవుతోన్న నెటిజన్లు..
Gautam Gambhir Vs Afridi
Venkata Chari
|

Updated on: Aug 29, 2022 | 5:48 PM

Share

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, భారత మాజీ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఏర్పడ్డ విషయం ఇరు దేశాల అభిమానులకు తెలిసిందే. ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత కూడా పరిస్థితి భీకరంగానే ఉంటుంది. తాజాగా గంభీర్‌పై అఫ్రిది కీలక ప్రకటన చేశాడు. ఇది భారత అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ను ఓ రేంజ్‌లో తిట్టేస్తున్నారు. ఆసియా కప్ సందర్భంగా గంభీర్‌పై అఫ్రిది హేళన చేయడం ద్వారా కొత్త వివాదానికి దారితీశాడు.

ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరిగింది. అఫ్రిదీని ఒక టాక్ షోలో నిపుణుడిగా పిలిచారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ వార్తా ఛానెల్‌లు సంయుక్తంగా ఇరు దేశాల క్రికెటర్లను ముఖాముఖి ప్యానెల్‌లో ఇంటరాక్ట్ అయ్యేలా చేశాయి. ఈ సంభాషణ సందర్భంగా అఫ్రిది భారత మాజీ ఓపెనర్ గంభీర్‌తో తన మైదానంలో పోటీని గుర్తుచేసుకున్నాడు. ఈ టాక్ షోలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ప్యానెల్‌లో భాగమయ్యాడు.

పాకిస్థానీ ఛానల్ సామా టీవీలో నిపుణుల ప్యానెల్‌లో భాగమైన అఫ్రిది, సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్‌తో చాలా వేడిగా మాట్లాడాడు. మరే ఇతర భారత ఆటగాడితోనూ నాకు గొడవలు లేవని అఫ్రిది పేర్కొన్నాడు. అవును, కొన్నిసార్లు గౌతమ్ గంభీర్‌తో సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. గౌతమ్ గంభీర్ భారత జట్టులో ఎవరూ ఇష్టపడని వ్యక్తి అని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

2007లో గంభీర్, అఫ్రిది తొలిసారిగా గ్రౌండ్ ఫైట్ చేశారు. ఇద్దరూ అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు. మ్యాచ్ తర్వాత ఇద్దరికీ జరిమానా విధించారు. గంభీర్ భారతదేశంలోని అత్యుత్తమ ఎడమచేతి వాటం ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచాడు. గంభీర్ తన క్రికెట్ కెరీర్‌లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 T20 ఇంటర్నేషనల్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 ఇంటర్నేషనల్స్‌లో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.