IND vs PAK: ఆసియాకప్‌లో మరోసారి తలపడనున్న భారత్, పాక్ జట్లు.. మ్యాచ్ ఎప్పుడంటే?
ASIA CUP 2022: ఆసియా కప్ 2022లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా భారత్ తమ ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించింది. అయితే, ఇరుజట్లు మరోసారి ఆసియా కప్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి.
ASIA CUP 2022, Ind vs Pak: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తన ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించింది. ప్రపంచం మొత్తం చూపు ఈ మ్యాచ్‌పైనే ఉన్న సంగతి తెలిసిందే. మైదానంలో పోటీ కూడా అదే విధంగా హై వోల్టేజీలా మారిన సంగతి తెలిసిందే. పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ సాధించింది. దీంతో గ్రూప్-ఎలో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. ఆసియా కప్ 2022లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఇదే చివరి మ్యాచ్ కాదు. రెండు జట్లూ ఒక వారంలో మరోసారి తలపడే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మరోసారి పాకిస్థాన్‌ను ఓడించాలని కోరుకుంటుంది.
సూపర్ 4లో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్..
పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు భారత్‌తో గ్రూప్ Aలో ఉన్నాయి. గ్రూప్ A, B రెండింటి నుంచి టాప్ 2 జట్లు సెప్టెంబర్ 3 నుంచి జరిగే సూపర్ 4లోకి ప్రవేశిస్తాయి. సెప్టెంబర్ 4న అంటే వచ్చే ఆదివారం, గ్రూప్ Aలోని టాప్ 2 జట్లు మరోసారి తలపడతాయి. అంటే భారత్, పాక్ జట్లు ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడించగానే, మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైనట్లే. హాంకాంగ్ తన రెండు మ్యాచ్‌లలో ఏదైనా ఒకదానిని గెలిస్తే, టాప్ 2 జట్లలో ఒకదానికి ఇబ్బంది ఉంటుంది. మ్యాటర్ నెట్ రన్ రేట్‌కు చేరుకుంటుంది. భారత్ పటిష్ట స్థితిలో ఉంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ 0.175 కాగా, పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -0.175.
లెక్క సమం చేసిన భారత్..
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ద్వారా భారత్ తన ప్రచారాన్ని విజయవంతంగా ప్రారంభించింది. అలాగే మునుపటి ఓటమి ఖాతాను కూడా సమం చేసింది. టీ20 ప్రపంచకప్ 2021లో చివరిసారిగా ఇరు జట్లు ముఖాముఖి తలపడగా, ఇదే మైదానంలో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా పాత లెక్కలు సమం చేసింది.
ఆసియా కప్ షెడ్యూల్..
తేదీ | పోటీ | స్థానం |
4 సెప్టెంబర్ | A1 vs A2 | దుబాయ్ |
6 సెప్టెంబర్ | A1 vs B1 | దుబాయ్ |
7 సెప్టెంబర్ | A2 vs B2 | దుబాయ్ |
8 సెప్టెంబర్ | A1 vs B2 | దుబాయ్ |
9 సెప్టెంబర్ | B1 vs A2 | దుబాయ్ |
సెప్టెంబర్ 11 | ఫైనల్ | దుబాయ్ |