- Telugu News Photo Gallery Cricket photos Ind vs pak rohit sharma 1st place in most runs in t20i during pakistan match martin guptill 2nd virat kohli 3rd place telugu cricket news
Rohit Sharma: 44 నిమిషాల ఆటతో నంబర్ వన్‌గా మారిన హిట్‌మ్యాన్.. టీ20ల్లో సరికొత్త రికార్డ్.. కోహ్లీ ప్లేస్ ఎక్కడంటే?
భారత్ ఈ విజయంలో రోహిత్ శర్మ సహకారం ప్రత్యేకంగా ఏం లేదు. 44 నిమిషాల ఇన్నింగ్స్‌లో అతను 18 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు.
Updated on: Aug 29, 2022 | 3:05 PM

ASIA CUP 2022: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఆసియా కప్‌లో విజయంతో అరంగేట్రం చేశాడు. భారత్ ఈ విజయంలో రోహిత్ శర్మ సహకారం ప్రత్యేకంగా ఏం లేదు. 44 నిమిషాల ఇన్నింగ్స్‌లో అతను 18 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, ఈ 12 పరుగులే రోహిత్‌ను నంబర్‌వన్‌గా నిలబెట్టాయి.

అది ఎలా అని ఆలోచిస్తున్నారా? అక్కిడికే వస్తున్నాం. ఈ 12 పరుగుల కారణంగా, రోహిత్ శర్మ T20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ రికార్డును బద్దలు కొట్టాడు.

రోహిత్ శర్మ 133 మ్యాచ్‌ల్లో 125 ఇన్నింగ్స్‌ల్లో 3499 పరుగులు చేశాడు. అతను 4 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో దాదాపు 140 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 3497 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ పరుగులను కివీ ఓపెనర్ 121 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలతో దాదాపు 136 స్ట్రైక్ రేట్‌తో సాధించాడు.

ఈ జాబితాలో భారత్‌కు చెందిన విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 100 టీ20 మ్యాచ్‌లు ఆడి 3343 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 30 అర్ధ సెంచరీలు సాధించాడు. స్ట్రైక్ రేట్ 137 కంటే ఎక్కువగా ఉంది.





























