- Telugu News Photo Gallery Nose length is linked to the size of the penis says Japan researchers in new study telugu health news
New Study: ముక్కును బట్టే పురుషాంగ పరిమాణం.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..
ఇందులో ముఖ్యంగా పురుషాంగం పరిమాణంలో తేడాలతో చాలామంది మగవారు అపోహలు పడుతుంటారు. అయితే, తాజాగా అంగం సైజుపై సరికొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
Updated on: Aug 27, 2022 | 11:38 AM

లైంగికాంశాల పట్ల చాలామంది ఆసక్తి చూపించడం సహజమే. అయితే, వీటిపై మాట్లాడేందుకు చాలామంది సిగ్గుపడుతుంటారు. అయితే, లైంగికాంశాల్లో చాలామందికి ఎన్నో ప్రశ్నలు మిగిలి ఉంటాయి. వాటిలో కొన్నింటిని నమ్మి చాలా ఒత్తిడికి గురవుతంటుంటారు. ఇందులో ముఖ్యంగా పురుషాంగం పరిమాణంలో తేడాలతో చాలామంది మగవారు అపోహలు పడుతుంటారు. అయితే, తాజాగా అంగం సైజుపై సరికొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. జపాన్ శాస్త్రవేత్తలు(Japan researchers) చేసిన అధ్యయనంతో ఈ విషయంపై కాస్తంత క్లారిటీ ఇచ్చే ప్రయత్ని చేశారు.

చేతులు పొడవుగా, భుజాలు వెడల్పుగా ఉన్న పురుషుల పురుషాంగం సైజు కూడా పెద్దగా ఉంటుందని చాలా మంది అనుకుంటుంటారు. మీరు కూడా ఇలానే భావిస్తుంటే ఇది నిజం కాదని తెలుసుకోండి. ఇది మేం చెప్పడం కాదండోయ్.. జసాన్ శాస్త్రవేత్తలు చేసిన సరికొత్త పరిశోధనలో తేల్చారు. వారి ప్రకారం ముక్కు పొడవు, పురుషాంగం పొడవు మధ్య లోతైన సంబంధం ఉందని కనుగొన్నారు.

కొత్త అధ్యయనం ప్రకారం, పెద్ద ముక్కు ఉన్న పురుషుల పురుషాంగం కూడా పొడవుగా ఉంటుంది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, జననేంద్రియాల పొడవు, శరీర భాగాల మధ్య వాస్తవానికి సంబంధం ఉందా లేదా అది కేవలం యాదృచ్చికమా అనేది తెలియాల్సి ఉంది. పెద్ద ముక్కులు ఉన్న పురుషుల్లో అంగ పరిమాణం కనీసం 5.3 అంగుళాల పొడవు ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

చిన్న ముక్కులు ఉన్న పురుషులు నిటారుగా ఉన్నప్పుడు పురుషాంగం పొడవు 4.1 అంగుళాలు ఉన్నట్లు కూడా తేల్చారు. ఈ అధ్యయనం నివేదిక క్లినికల్ ఆండ్రాలజీలో ప్రచురించారు.

ఈ అధ్యయనంలో దాదాపు 126 మంది పురుషుల శవాలను పరిశీలించారంట. వారు మరణించిన మూడు రోజుల్లోనే శరీరంలోని అనేక భాగాలను కొలిచారు.

క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వారి ఎత్తు, బరువు, పురుషాంగం పొడవు, పురుషాంగం చుట్టుకొలత, వృషణాల బరువును పరిగణనలోకి తీసుకున్నారు.

ముక్కు పరిమాణం పురుషాంగం పొడవును వయస్సు, ఎత్తు లేదా శరీర బరువును బట్టి నిర్ణయించబడదని ఇది సూచిస్తుంది. అయితే అది పుట్టకముందే నిర్ణయం అవుతుందని తేల్చింది. ఈ డేటా విశ్లేషణలో పురుషుల పొడవు పురుషాంగం పరిమాణంతో పరస్పర సంబంధం కలిగి ఉందని కూడా పేర్కొంది.

ఒక ప్రత్యేక అధ్యయనం ప్రకారం, జపాన్‌లో సగటు పురుషాంగం పరిమాణం 4.5 అంగుళాలుగా ఉందని తేల్చింది. ముక్కు, పురుషాంగం పరిమాణం మధ్య అనుబంధాన్ని కనుగొన్నారు. కానీ, వారు ఎందుకు అనే కారణం మాత్రం కనుగొనలేకపోయారు.





























