- Telugu News Photo Gallery Cricket photos Pakistan cricket team lowest score against india in asia cup 2016 hardik pandya virat kohli
Asia Cup: హార్దిక్, జడేజాల దెబ్బకు పాకిస్తాన్ విలవిల.. అత్యల్ప స్కోర్‌కే ఆలౌట్.. ఘోర పరాజయం.. ఎప్పుడంటే
ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఈ ఫార్మాట్‌లో ఆసియాకప్ జరగడం ఇది రెండోసారి మాత్రమే. ఈ ఫార్మాట్‌లో ఆసియా కప్‌లో అత్యల్ప స్కోరు గురించి మాట్లాడితే, పాకిస్తాన్ పేరిట కూడా ఓ రికార్డ్ నెలకొని ఉందంటే నమ్మగలరా..
Updated on: Aug 27, 2022 | 10:01 AM

ASIA CUP 2022: గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, పాక్ జట్లు పెద్దగా తలపడలేదు. కానీ, ఇరు జట్లు తలపడినప్పుడల్లా ఉత్కంఠకు కొదువే ఉండదు. ఇందులో కొన్ని అద్భుతమైన, మరికొన్ని ఇబ్బందికరమైన రికార్డులు కూడా ఉన్నాయి. నేటి నుంచి ఆసియా కప్ 2022 మొదలుకానుంది. టోర్నీ రెండోరోజే భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడు నెలకొన్న రికార్డులు చూస్తే మాత్రం.. పాకిస్తాన్ జట్టు మాత్రం కచ్చితంగా తలదించుకోవాల్సిందే.

ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఈ ఫార్మాట్‌లో ఆసియాకప్ జరగడం ఇది రెండోసారి మాత్రమే. ఈ ఫార్మాట్‌లో ఆసియా కప్‌లో అత్యల్ప స్కోరు గురించి మాట్లాడితే, ఈ రికార్డు UAE వంటి చిన్న జట్టు పేరిట ఉంది. కానీ, ఇది ఆసియాలోని 5 టెస్ట్ జట్లలో పాకిస్తాన్ పేరిట నెలకొని ఉందంటే నమ్మగలరా..

2016 ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ ఇన్నింగ్స్‌లో 83 పరుగులకే కుప్పకూలింది. ఇది కూడా భారత్‌పైనే కావడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు మొత్తం 15 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది.

పాకిస్థాన్‌కు ఈ పరిస్థితి రావడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. భారత ఆల్ రౌండర్ తన బౌలింగ్‌లో 3.3 ఓవర్లలో కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. పాండ్యాతో పాటు రవీంద్ర జడేజా కూడా 3 ఓవర్లలో 11 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

అయితే, ఈ మ్యాచ్‌లో గెలవడానికి భారత్ కూడా కష్టపడాల్సి వచ్చింది. మహ్మద్ అమీర్ మొదటి ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో భారత్ స్కోరు 3 కోల్పోయి 8 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత కోహ్లి ధీటుగా ఇన్నింగ్స్ ఆడి 51 బంతుల్లో 49 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.




