AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీకట్లో ఫోన్ వాడుతున్నారా..? ఓర్నాయనో.. కళ్లతో చెడుగుడు ఆడుకుంటున్నట్లే.. 90శాతం యువతలో ఆ వ్యాధి..!

మయోపియా అనేది ఒక కంటి వ్యాధి.. దీని వలన ఒక వ్యక్తి దగ్గరి, దూరం వస్తువులను స్పష్టంగా చూడటంలో ఇబ్బంది పడతాడు. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ పరిశోధన ప్రకారం.. చీకట్లో లేదా మసక వెలుతురులో ఫోన్ ఉపయోగించడం, ల్యాప్‌టాప్ తో పనిచేయడం కూడా దోహదపడే అంశం..

చీకట్లో ఫోన్ వాడుతున్నారా..? ఓర్నాయనో.. కళ్లతో చెడుగుడు ఆడుకుంటున్నట్లే.. 90శాతం యువతలో ఆ వ్యాధి..!
Phone Use In Dark Night
Shaik Madar Saheb
|

Updated on: Feb 21, 2026 | 11:53 AM

Share

మయోపియా అనేది కంటికి సంబంధించిన ఒక వ్యాధి.. దీని వలన దగ్గరి దృష్టి క్షీణిస్తుంది. ఒకప్పుడు ఈ పరిస్థితికి అధిక స్క్రీన్ సమయం ఒక ప్రధాన కారణంగా పరిగణించేవారు.. కానీ కొత్త పరిశోధన ప్రకారం.. ఇది మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ల వల్ల మాత్రమే కాకుండా, తక్కువ కాంతిలో ఫోన్ లేదా ఇతర పరికరాన్ని మసక వెలుతురులో ఉపయోగించడం.. తక్కువ కాంతిలో పనిచేయడం వల్ల కూడా సంభవించవచ్చు. SUNY కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించగా.. దీనిలో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. ఇది సెల్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు.

మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా పుస్తకం చదవడం వల్ల రెటీనాకు చేరే కాంతి పరిమాణం తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ఇది కళ్ళపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.. మయోపియా ప్రమాదాన్ని పెంచుతుంది. అధ్యయన రచయిత జోస్ మాన్యుయెల్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మయోపియా వేగంగా పెరుగుతున్న సమస్య. మసక వెలుతురులో పనిచేయడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని మా పరిశోధన స్పష్టంగా చూపిస్తుంది. అందువల్ల, ప్రజలు తమ ఫోన్‌లు – ల్యాప్‌టాప్‌లను తగినంత వెలుతురులో మాత్రమే ఉపయోగించాలని సూచించారు. మయోపియా (Myopia) లేదా హ్రస్వదృష్టి అనేది దగ్గరి వస్తువులు స్పష్టంగా కనిపించి, దూరపు వస్తువులు మసకగా కనిపించే ఒక సాధారణ కంటి సమస్య..

మయోపియా అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధి..

అమెరికా మరియు యూరప్‌లలో, దాదాపు 50% మంది యువకులు మయోపియాతో బాధపడుతున్నారు.. అయితే కొన్ని తూర్పు ఆసియా దేశాలలో, ఈ సంఖ్య 90% కి చేరుకుంది. పేలవమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. మయోపియా విషయంలో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, దీనిని సకాలంలో నియంత్రించకపోతే, అది తీవ్రంగా మారవచ్చు. ఈ వ్యాధి పిల్లలలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.

మయోపియా సాధారణ లక్షణాలు ఏమిటి?

దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం

తలనొప్పి

కంటి నొప్పి

కొన్నిసార్లు అస్పష్టమైన దృష్టి

20-20 నియమాన్ని పాటించండి

ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కు దూరంగా చూడండి (20-20-20 నియమం)

మంచి వెలుతురులో చదువుకోండి.. లేదా ఫోన్ చూడండి..

ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయండి

స్క్రీన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు సురక్షితమైన దూరాన్ని పాటించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us