Telanagna: డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్.. మే నెలాఖరు కల్లా.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను త్వరతగతిన పూర్తి చేయాలని సూచించింది. వీటిని మే నెలాఖరు కల్లా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని తాజాగా ఆదేశించింది.

డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎంతోమంది ఎదురుచూస్తోన్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి ప్రభుత్వం సూపర్ న్యూస్ తెలిపింది. మే చివరి నాటికి ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం ఆగిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను మే నెల చివరి నాటికి పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మాణం చివరి దశలో ఉన్న ఇళ్లను త్వరతగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని సూచించారు. నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు
డబుల్ బెడ్ రూం ఇళ్లను అవసరమైన ఖర్చు మొత్తాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 5 లక్షల వరకు అందిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన వాటిని నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే.. లబ్దిదారులే నిర్మించుకునేలా నిధులు అందిస్తామని స్పష్టం చేశారు. వీటికి గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు అందేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.400 కోట్ల కేటాయిస్తామన్నారు. ఇళ్లను తీసుకుని అక్కడ నివసించనివారిని తప్పించి అర్హులైన వారికి వాటిని అందించాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల దగ్గర కరెంట్, వాటర్, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను పొంగులేటి ఆదేశించారు. ఈ ఇళ్లు పొందినవారిలో అనర్హులు ఉంటే వారిని తొలగించి అర్హులకు ఇళ్లను కేటాయించాలని సూచించారు.
అర్హులకు మాత్రమే ఇళ్లు
తక్షణమే అనర్హులను తొలగించే ప్రక్రియ చేపట్టాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. అర్హులకు మాత్రమే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో స్థానిక ఎమ్మెల్యేలను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. ఇక డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులను సస్పెండ్ చేస్తామని, సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. అర్హులైనవారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించే బాధ్యత కలెక్టర్లకు ఉందన్నారు. మొదటి విడతలో మంజూరు అయిన ఇళ్లల్లో నిర్మించుకోనివారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని పొంగులేటి పేర్కొన్నారు.
