నేటికి 50 ఏళ్లు.. భక్తుల పేరుతో ఒక్క పూజ కూడా జరగని ఆలయం.. బిర్లా మందిర్ ప్రత్యేకత ఇదే!
30 May 2026
Rajashekher
హుస్సేన్ సాగర్ ఒడ్డున, 280 అడుగుల ఎత్తైన కాలాపహాడ్ కొండపై వెలసిన బిర్లా మందిర్ నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
హైదరాబాద్‌కు తలమానికం
1976లో ప్రతిష్ఠించిన ఈ ఆలయం 2026 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటోంది.
50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలు
రాజస్థాన్ నుంచి తెప్పించిన సుమారు 2 వేల టన్నుల స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు.
పాలరాతితో నిర్మించిన అద్భుత కట్టడం
1966లో ప్రారంభమైన ఆలయ నిర్మాణం పూర్తవడానికి దాదాపు పదేళ్ల సమయం పట్టింది. అప్పటికీ ఇప్పటికీ ఈ మందిరం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూనే ఉంది.
10 ఏళ్లపాటు సాగిన నిర్మాణం
గుంటూరు జిల్లా ఫిరంగిపురం నల్లరాతితో ప్రసిద్ధ శిల్పి గణపతి స్థపతి రూపొందించిన 11 అడుగుల ఎత్తైన వేంకటేశ్వర స్వామి విగ్రహం ఆలయ ప్రధాన ఆకర్షణ.
శ్రీనివాసుని దివ్య విగ్రహం
తిరుమల, పూరి జగన్నాథ ఆలయాల నిర్మాణ శైలుల మేళవింపుతో బిర్లా మందిర్ ప్రత్యేక రూపాన్ని సంతరించుకుంది.
ఉత్తర–దక్షిణ భారతీయ శైలుల సమ్మేళనం
ఆలయ నిర్మాణ సమయంలో లభించిన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఇక్కడ స్వయంభూ హనుమంతునిగా భక్తులు పూజిస్తారు.
స్వయంభూ హనుమంతుని ఆలయం
సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
పాంచరాత్ర ఆగమ పద్ధతిలో పూజలు
ఆలయం ప్రారంభమైన నాటి నుంచి భక్తుల పేరుమీద గానీ, బిర్లా కుటుంబ సభ్యుల పేరుమీద గానీ ప్రత్యేక పూజలు నిర్వహించకపోవడం ఈ ఆలయ ప్రత్యేకత. అన్ని పూజలు లోకకల్యాణం కోసమే నిర్వహిస్తారు.