AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. ఏకంగా 25 శాతం రాయితీ.. వారికి పెద్ద రిలీఫ్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులపై 25 శాతం రాయితీ ప్రకటించింది. జులై వరకు ఈ సౌకర్యం అందుబాాటులో ఉండనుంది. ప్రస్తుతం చాలామంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసున్నా ఫీజు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana: తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. ఏకంగా 25 శాతం రాయితీ.. వారికి పెద్ద రిలీఫ్..
Money 5
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Apr 30, 2026 | 7:21 PM

Share

లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న LRS ఫీజుల చెల్లింపులను వేగవంతం చేసేందుకు 25 శాతం రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ మే 1 నుంచి జూలై 31, 2026 వరకు అమల్లో ఉండనుంది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో LRS కోసం దరఖాస్తు చేసుకుని, ఇంకా పూర్తి చెల్లింపులు చేయని వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారనుంది. నిర్ణీత గడువులోపు పెండింగ్ మొత్తాలను చెల్లిస్తే, 25 శాతం తగ్గింపుతో ఫీజును చెల్లించే అవకాశం లభిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు కావడమే కాకుండా, దరఖాస్తుదారులపై ఉన్న ఆర్థిక భారం కూడా కొంత తగ్గనుంది.

రాయితీతో మరో అవకాశం

రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనుమతి లేని లేఅవుట్లు విస్తరించిన నేపథ్యంలో వాటిని చట్టబద్ధ వ్యవస్థలోకి తీసుకురావడమే LRS పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రక్రియ ద్వారా ప్లాట్లకు లీగల్ స్టేటస్ లభించి, భవన అనుమతులు పొందడం సులభమవుతుంది. అలాగే రిజిస్ట్రేషన్, కొనుగోలు..అమ్మకాల ప్రక్రియలు కూడా నిరాటంకంగా సాగేందుకు దోహదం చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు గడువులు పొడిగించినప్పటికీ, అనేక మంది దరఖాస్తుదారులు ఇంకా ఫీజులు చెల్లించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాయితీతో మరో అవకాశం కల్పించింది. అయితే ఈసారి గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పొడిగింపు లేదా రాయితీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వెంటనే చెల్లింపులు చేయండి

MA&UD శాఖ దరఖాస్తుదారులను అప్రమత్తం చేస్తూ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే చెల్లింపులు పూర్తి చేసుకోవాలని సూచించింది. గడువులోపు రాయితీని వినియోగించుకుంటేనే పూర్తి లాభం పొందవచ్చని తెలిపింది. మొత్తంగా ఈ నిర్ణయం వేలాది మంది LRS దరఖాస్తుదారులకు ఉపయోగపడే అవకాశం ఉండగా, పెండింగ్ ఫీజుల వసూళ్లలో కూడా ప్రభుత్వం భారీ పురోగతి సాధించనుంది.

Follow Us